»   » ఈ వార్త నిజమే అయితే రవితేజ మళ్ళీ వెనక్కే.... పాపం ఇలా అవుతుందేంటీ...

ఈ వార్త నిజమే అయితే రవితేజ మళ్ళీ వెనక్కే.... పాపం ఇలా అవుతుందేంటీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగాల్ టైగ‌ర్ సినిమా వ‌చ్చి దాదాపు ఏడాది కావ‌స్తోంది. ఇప్ప‌టిదాకా రవితేజ కొత్త సినిమా క‌నీసం మొద‌లు కూడా కాలేదు. అంతా అనుకున్న ప్ర‌కారం జ‌రిగి ఉంటే.. మాస్ రాజా కొత్త సినిమా పూర్త‌యి విడుద‌ల కూడా అయ్యుండేది. కానీ దిల్ రాజు నిర్మాణంలో చేయాల్సిన సినిమా పారితోష‌కంలో పేచీ కార‌ణంగా ఆగిపోయింది. త‌ర్వాత సుధీర్ వ‌ర్మ‌తో సినిమా అన్నారు.

ఒక‌రిద్ద‌రు కొత్త ద‌ర్శ‌కుల పేర్లు కూడా వినిపించాయి. రంజిత్ మూవీస్ బేన‌ర్లోనూ సినిమా చేస్తాడ‌ని చ‌ర్చ జ‌రిగింది. కానీ ఇవేవీ కార్య‌రూపం దాల్చ‌లేదు. చివ‌రికి త‌న‌కు ప‌వ‌ర్ లాంటి హిట్టిచ్చిన బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ రాజా సినిమా ఖాయ‌మైంది. వరుసగా సినిమాలు చేసే రవితేజ స్పీడ్ తగ్గించాడు. వరుస ఫెల్యూర్స్ కారణంగా మాస్ రాజా ఆచితూచి కొత్త సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే రవితేజ గ్యాప్ తీసుకుని సినిమాలు చేయడానికి కేరింగ్ తో పాటు బెట్టు చేయడమే అని తెలుస్తోంది.

Raviteja Up coming Movie Has Stopped

దిల్ రాజుతో చేసే సినిమా క్యాన్సిల్ కావడానికి రవితేజ తగ్గకపోవడమే అని కూడా చెప్పుకున్నారు. మామూలుగా రవితేజ కాస్త అటు ఇటుగా 7 నుంచి 8కోట్లా రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. అయితే వరుసగా కిక్ 2, బెంగాల్ టైగర్ రిజల్ట్స్ తేడా కొట్టాయి. దీంతో దిల్ రాజు, రవితేజతో చేసే మూవీకి 5కోట్ల మాత్రమే ఇస్తానని చెప్పాడట. కానీ ఈ మాస్ స్టార్ అందుకు సమిసేరా అనడంతో దిల్ రాజు, రవితేజల కాంబినేషన్ మూవీ అటకెక్కింది. అయితే బాబీ దర్శకత్వంలో చేయనున్న సినిమా కోసం రెమ్యూనరేషన్ పరంగా మాస్ రాజా బాగానే తగ్గాడని వినికిడి.

ఈ సినిమాకు 'క్రాక్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన‌ట్లు ఈ మ‌ధ్య వార్త‌లొచ్చాయి. కానీ ఇప్పుడేమో ఈ సినిమా మొద‌ల‌వ‌క‌ముందే ఆగిపోయిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.కార‌ణాలేంట‌న్న‌ది తెలియ‌ట్లేదు కానీ.. ఈ సినిమా అట‌కెక్కేసిన‌ట్లు మాత్రం ప్ర‌చారం కొంచెం గ‌ట్టిగానే వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని చుట్టాల‌బ్బాయి నిర్మాత‌లు ప్రొడ్యూస్ చేయాల్సింది. మ‌రి స్క్రిప్టు సంతృప్తిక‌రంగా రాక‌పోవ‌డం వ‌ల్లే సినిమాకు బ్రేక్ ప‌డిందా.. ఇంకేదైనా కార‌ణాలున్నాయో అన్న‌ది తెలియాల్సి ఉంది. ముందు అనుకున్న ప్ర‌కార‌మైతే అక్టోబ‌ర్లో ఈ చిత్రం మొద‌ల‌వ్వాల్సింది. కానీ ప్రారంభోత్స‌వం గురించి కూడా ఏ అప్ డేట్ వినిపించ‌ట్లేదు. మ‌రి దీనిపై రాబోయే రోజుల్లో ఏమైనా క్లారిటీ వ‌స్తుందేమో చూడాలి.

English summary
Latest buzz in Telugu filim industry is that Tollywood Mass maharaja Raviteja's New project With Bobby is stopped
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu