»   » క్రికెటర్‌తో నటి రాధిక కూతురు ప్రేమ వివాహం!

క్రికెటర్‌తో నటి రాధిక కూతురు ప్రేమ వివాహం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా నటి రాధిక కూతురు రయానే వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ నెల 23న ఆమె నిశ్చితార్థం జరుగబోతెన్నట్లు తెలుస్తోంది. క్రికెటర్ అభిమన్యు మిథున్‌తో ఆమె వివాహం జరుగబోతోంది. ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది.

Rayane Radhika engaged to Abhimanyu Mithun

ఐపీఎల్ మ్యాచుల్లో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ తరుపున ఆడిన అభిమన్యు మిథున్‌కు, రయానేకు మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో విషయం ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించారు. పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిశ్చితార్థానికి రంగం సిద్ధమయింది.

Rayane

అయితే వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందనేది ఇంకా ఫిక్స్ కాలేదు. ప్రస్తుతం రయానే రాధిక రన్ చేస్తున్న సినీ నిర్మాణ సంస్థ బాధ్యతల్లో పాలు పంచుకుంటోంది. రాడాన్ మీడియా సంస్థ నిర్వహణ బాధ్యతల్లో రయానే కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Veteran southern actress Radhika's daughter Rayane Radikaa will get engaged to Indian cricketer Abhimanyu Mithun on September 23 in a traditional ceremony here.
Please Wait while comments are loading...