»   » మిస్టరీ: రజనీ మూవీ విడుదల అందుకే ఆగిందా?

మిస్టరీ: రజనీ మూవీ విడుదల అందుకే ఆగిందా?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'విక్రమ సింహ' (కొచ్చాడయాన్) చిత్రం ఈ నెల 9న విడుదల కావాల్సి ఉండగా ఉన్నట్టుండి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత సినిమా విడుదల ఆపిపారు. మే 23న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. సినిమా వాయిదా పడటానికి టెక్నికల్ సమస్యలని బయటకు చెబుతున్నా....ఇతర కారణాలు కూడా దిగి ఉన్నట్లు చెన్నై సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

  టెక్నికల్ రీజన్స్
  ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసిన అఫీషియల్ ప్రకటనలో టెక్నికల్ సమస్యల వల్లనే సినిమాను వాయిదా వేసామని, భారీ సంఖ్యలో ఉన్న సినిమాకు సంబంధించిన ఫ్రింట్లు ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయడంలో సమస్య ఏర్పడటం వల్లనే సినిమాను మే 23కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

  ఆర్థిక సమస్యలు
  అయితే సినిమా వాయిదా పడటానికి అసలు కారణం ఆర్థిక కారణాలే అనే రూమర్లుకూడా వినిపిస్తున్నాయి. కొచ్చాడయాన్ చిత్ర నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ధర, లాభాల షేరింగ్ విషయంలో విబేధాలు వచ్చాయని అంటున్నారు.

  ఆర్థిక పరమైన సమస్యలే?

  ఆర్థిక పరమైన సమస్యలే?


  ఈరోస్ సంస్థ చెబుతున్నట్లు టెర్నికల్ రీజన్స్ నమ్మదగినవిగా లేవని, సినిమా ఫైనాన్సియల్ క్రష్ వల్లనే విడుదల వాయిదా వేసారనే వాదన బలంగా వినిపిస్తోంది.

  పొలిటికల్ కనెక్షన్?

  పొలిటికల్ కనెక్షన్?

  సినిమా ఆగిపోవడం వెనక పొలిటికల్ కనెక్షన్ ఏమైనా ఉందా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. గతంలో రజనీకాంత్ ‘విశ్వరూపం', విజయ్ ‘తలైవా' చిత్రాలు అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, రజనీకాంత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, కారణం అది అయి ఉండదని కిందరు అంటున్నారు. జయలలిత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే జయా టీవీ ‘కొచ్చాడయాన్' శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.

  ఆ నమ్మకం కూడా కారణమా?

  ఆ నమ్మకం కూడా కారణమా?

  సినిమా విడుదల వెనక మరో కారణం కూడా వినిపిస్తోంది. రజనీకాంత్ సినిమాలకు 9 అంకె కలిసి రాదని, అందుకే సినిమాను వాయిదా వేసి ఉంటారని అంటున్నారు.

  నెగెటివ్ ఫీడ్ బ్యాక్

  నెగెటివ్ ఫీడ్ బ్యాక్

  సినిమా విడుదలకు ముందే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో సినిమాలోని కొన్ని సీన్ల విషయంలో మార్పులు చేస్తున్నారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.

  ఆ విషయం మిస్టరీగానే..

  ఆ విషయం మిస్టరీగానే..


  బయట అనేక రూమర్లు వినిపిస్తుండటంతో.....విడుదల వాయిదా వెనక ఏదో ఒక మిస్టరీ దాగి ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

  English summary
  There is anger and frustration combined with disappointment over the postponement of the release of Rajinikanth starrer Kochadaiiyaan. The excitement of audience was suddenly shattered last evening (May 7) with the official announcment of the delay in the release of the mulitlingual flick. It came as a shocker to many but some were not surprised by the development as a few big films in the recent years have failed to release on the promised date. While the makers of Kochadaiiyaan have cited technical issues, many have felt there could be some other reasons behind the delay.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more