twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి మరణానికి కారణం అదా..? నిజాలు విప్పిన దాసరి కుమార్తె

    జనవరి నెలలో దాసరి నారాయణ రావు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారనే వార్త బయటకు వచ్చినప్పుడు సినీ పరిశ్రమే కాదు సామాన్య ప్రజానీకం కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు.

    |

    జనవరి నెలలో దాసరి నారాయణ రావు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారనే వార్త బయటకు వచ్చినప్పుడు సినీ పరిశ్రమే కాదు సామాన్య ప్రజానీకం కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు లేని దాసరి ఐసీయూ లో చికిత్స తీసుకునే అంత అనారోగ్యం ఏంటనేదే అందరి అనుమానం.

    అన్నవాహిక దెబ్బతిన్నదని

    అన్నవాహిక దెబ్బతిన్నదని

    చివరికి అన్నవాహిక దెబ్బతిన్నదని, దానివల్ల ఇన్ఫెక్షన్లు తన ప్రాణం మీదకు తెచ్చాయని తేలింది. అయితే చికిత్స అనంతరం దాసరి ఆరోగ్యం కుదట పడటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఇటీవల తన పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా జరుపుకోవడంతో అంతా గండం గడిచిందనుకున్నారు. అయితే మళ్లీ నెలలోపే దాసరి నారాయణ రావు ఆస్పత్రి పాలయ్యారు. ఈ సారి మాత్రం నమ్మలేని నిజాన్ని వినాల్సి వచ్చింది. రెండు మేజర్ ఆపరేషన్లతో గుండె తట్టుకోలేక పోయింది.

    మధుమేహం తప్ప

    మధుమేహం తప్ప

    దాసరి నారాయణ రావుకు వయస్సుతో పాటే వచ్చే మధుమేహం తప్ప మరే దీర్ఖకాలిక వ్యాధులు లేవు. అయితే బరువు తగ్గేందుకు దాసరి తీసుకున్న నిర్ణయాలే ఈ ఘటనకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బరువు తగ్గాలని డాక్టర్ల సలహా మేరకు దాసరి బేరియాట్రిక్ సర్జరీకి సిద్ధమయ్యారు.

    బేరియాట్రిక్ సర్జరీ

    బేరియాట్రిక్ సర్జరీ

    అయితే 75 ఏళ్ల వయస్సులో బేరియాట్రిక్ సర్జరీ మంచిది కాదని అతని సన్నిహితులు వారించినా దాసరి వెనక్కు తగ్గలేదని తెలుస్తుంది. అయితే ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టమైందని డాక్టర్లు చెప్తూనే ఉంటారు. బాడీలోని కొవ్వును బయటకు తీసే క్రమంలో పలు సర్జరీలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే దాసరి అన్నవాహికకు గాయం అయినట్లు ప్రచారం. జరిగింది అయితే ఆ విషయాలనే ఇప్పుడు దాసరి కుమార్తే హేమాలయా ఇలా వివరించారు...

    ఆహారం తక్కువ తినేలా చేసి..

    ఆహారం తక్కువ తినేలా చేసి..

    బరువు తగ్గేందుకు తోడ్పడే సర్జరీ ఒకటి నాన్నగారు గత ఏడాది చేయించుకున్నారు. అప్పుడది బాగానే పని చేసింది. ఐతే జనవరిలో రెండోసారి కూడా అలా బెలూన్ వేయించుకొనే సర్జరీకి వెళ్లారు. కానీ మొదటిసారి సర్జరీ చేసిన డాక్టర్ ఈసారి లేరు.

    ఎక్కడో తేడా వచ్చి

    ఎక్కడో తేడా వచ్చి

    దీంతో మరో డాక్టర్ తో ఆ సర్జరీ చేయించుకున్నారు. ఎక్కడో తేడా వచ్చి.. ఇంటికొచ్చాక అది సీరియస్ అయింది. మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపిస్తే... సర్జరీ ఫెయిలైంది.. ఈసోఫ్యాగస్ (అన్నవాహిక)లో బెజ్జం పడిందని చెప్పారు. అలాగే ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోయింది.

    సర్జరీల మీద సర్జరీలు

    సర్జరీల మీద సర్జరీలు

    అక్కడ నుంచి వరుసగా ప్రొసీజర్ల మీద ప్రొసీజర్లు.. సర్జరీల మీద సర్జరీలు జరిగాయి. ఐతే సీరియస్ కండిషన్ నుంచి ఎలాగోలా బయటపడి.. మార్చి 28న ఇంటికొచ్చారు. అప్పట్నుంచి పొట్ట దగ్గర ట్యూబు ద్వారా ద్రవాహారం తీసుకుంటూ కొద్దిగా కోలుకుంటూ వచ్చారు. ఐతే మామూలుగా నోటి ద్వారా తినేలా అన్నవాహికను పునర్నిర్మించేందుకు ఇంకో సర్జరీ చేయించుకోవాలనుకున్నారు.

    జరగరానిది జరిగిపోయింది

    జరగరానిది జరిగిపోయింది

    దాని కోసమే మే మూడో వారంలో ఆసుపత్రిలో చేరారు. అప్పుడు పెద్ద పేగును కట్ చేసి.. కృత్రిమంగా అన్నవాహికను నిర్మించే సర్జరీ చేశారు. తీరా అది ఫెయిలైంది. అవయవాలు ఒక్కొక్కటి పని చేయడం మానేశాయి. జరగరానిది జరిగిపోయింది" అని హేమాలయ వివరించారు.

    దాస‌రి మ‌ర‌ణానికి కార‌ణ‌ం

    దాస‌రి మ‌ర‌ణానికి కార‌ణ‌ం

    అధిక బ‌రువు త‌గ్గించే స‌ర్జ‌రీలు దాస‌రి మ‌ర‌ణానికి కార‌ణ‌మంటూ స్ప‌ష్టంచేశారు. నువ్వునాకు న‌చ్చావ్‌తో తెరంగేట్రం చేసిన‌.. ఆర్తిఅగ‌ర్వాల్ కూడా.. అధిక‌బ‌రువు త‌గ్గించుకోవాల‌నే ఉద్దేశంతోనే ప్రాణాలు కోల్పోయిన విష‌యాన్ని మ‌రోసారి వెండితెర ప్ర‌ముఖులు గుర్తు చేసుకుంటున్నారు.

    English summary
    Dasari's Doughter Hemalaya Revealed Reason Behind Dasari Narayana Rao Death
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X