»   »  'దశావతారం' కి ఏం దౌర్బాగ్యం పట్టించారు?

'దశావతారం' కి ఏం దౌర్బాగ్యం పట్టించారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Venu Madhav
హిట్టయిన సినిమాలు లోని పాత్రలను తీసుకుని పేరిడీ చేయటం పరిపాటే. అయితే దానికీ ఒక హద్దూ పద్దతి ఉండాలని మరీ నీచానికి దిగజారకూడదని అని ఆదివిష్ణు సినిమా చూసిన వారు విమర్శిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్ కుమార్ ని హీరోగా పెట్టి చేసిన ఈ చిత్రంలో కమల్ దశావతారంని పేరిడీ చేసి కామిడీ ట్రాక్ పెట్టారు. వేణు మాధవ్,ఎమ్మెస్ నారాయణల మధ్య ఈ పేరడీ నడుస్తుంది.దీన్ని వేణుమాధవే రాసినట్లు చెప్తున్నారు.

దశావతారంలో కమల్ లాగానే వేణుమాధవ్ రకరకాల గెటప్స్ లో కనపడుతూ నవ్వించాలని ప్రయత్నం చేసారు. అయితే చిత్రశుద్ది లేకుండా తయారు చేయటంతో ఆ హాస్యం కాస్త అపహాస్యం గా మారింది. దాంతో సీనియర్లు ధశావతారం పాత్రలకు ఎంత దౌర్బాగ్యం పట్టించారు... మిత్ర భేదం కథలో పులికి ఆకలేసి తమ పేగులను తానే పీక్కుని తిన్నట్లు ,ఏ గతిలేని తెలుగు సినిమా హాస్యం ఇలా అధ్బుతమైన పాత్రలను,ప్రయోగాలను అవహేళన చేయటానికే సరిపోతోందని భాధ పడుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X