»   » రెబెల్ స్టార్ కి అస్వస్తత:కేర్ లో చికిత్స పొందుతున్న కృష్ణం రాజు

రెబెల్ స్టార్ కి అస్వస్తత:కేర్ లో చికిత్స పొందుతున్న కృష్ణం రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిన్నటి తరం తెలుగు సినిమా రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా హైదరాబాదులో నివాసం ఉండే కృష్ణంరాజు శ్వాసతీసుకునేందుకు తీవ్ర ఇబ్బందిపడుతూ, అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో...

ఆదివారం అర్థరాత్రి కుటుంబ సభ్యలు బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్ సోమరాజు నేతృత్వంలో వైద్య బృందం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు.

Rebel Star Krishnam Raju has been hospitalized due to illness

సోమవారం ఉదయం హీరో ప్రభాస్ గంటపాటు ఆస్పత్రిలో కృష్ణంరాజు వద్ద ఉన్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కేర్ వైద్యులు వెల్లడించారు. 2015 ఫిబ్రవరిలోనూ ఇలాగే అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైయ్యారు. వయసు మీద పడుతోంది కదా కాస్త ఇలాంటి ఇబ్బందులు తప్పవేమో. 

English summary
Krishnam Raju Hospitalized - Prabhas Pays a Visit At Care Hospital
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu