»   » హోం మినిస్టర్ జోక్యంతో, 'అ..ఆ ' నుంచి పదాలు మ్యూట్

హోం మినిస్టర్ జోక్యంతో, 'అ..ఆ ' నుంచి పదాలు మ్యూట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ హీరో నితిన్, సమంతల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'అ..ఆ..'. మీనాకు రీమేక్ అనే పేరు తెచ్చుకున్నా, ఫ్యామిలీలకు బాగా పట్టడంతో ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాకు అంతా బాగానే ఉన్నా..రెడ్డి కులస్దులను అవమానం చేసారనే అరోపణలు ఎదుర్కొంది.

ఈ సినిమాలో హాస్య నటుడు షకలక శంకర్ ఓ దొంగ. అతను పేరు ప్రతాప్ రెడ్డి. అలాగే హైదరాబాద్ లో ఫ్రెండ్ ఉంటాడు. అతని పేరు బాల్ రెడ్డి ఫ్రం బంజారా హిల్స్ అని చెప్తాడు. ఇప్పుడీ ఈ రెండు పేర్లు అంతటా చర్చకు వచ్చాయి.

సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకే రెడ్డి జన సంఘం వారు ఈ పేర్లు తొలిగించాలంటూ కంప్లైంట్ చేసింది. అయితే మేకర్స్ దీనిపై స్పందించకపోవటంతో తెలంగాణా హోం మినిస్టర్ నాయని నర్సింహారెడ్డి కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దాంతో ఈ పేర్ల విషయంలో రెడ్డి అనే పదాన్ని ఇప్పుడు మ్యూట్ చేసారు నిర్మాతలు.

ఈ విషయమై నిర్మాతలు పేర్లు మ్యూట్ చేయటంలో లేటైనందుకు కారణం చెప్తూ... అభ్యంతరాలు వచ్చేసరికే డిజిటల్ ఫ్రింట్స్ వెళ్లిపోయాయి.అవి అక్కడ వారం రోజులు పాటు లాక్ అవుతాయి. ఆ సమయంలో ఏమీ చెయ్యలేం. మిగతా ధియేటర్స్ అన్నిటికి ఈ మార్చిన వెర్షన్ ని పంపటం జరిగింది. ఇప్పుడు మార్చిన వెర్షన్ అన్ని ధియేటర్స్ లోనూ తెరపై చూడవచ్చు. అలాగే కావాలని ఆ కమ్యూనిటిని మేం అవమానించేలా సీన్స్ ని పిక్చరైజ్ చేయలేదు అని అన్నారు.

ఇక రిలీజ్ కు ముందు నుంచే మంచి అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా, జూన్ 2న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచింది. త్రివిక్రమ్‌ డైలాగులుకు, రావు రమేష్ నటనకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ఓవర్ సీస్ లోనూ మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది.

English summary
The ‘Reddy Jana Sangham’ raised an objection on movie ‘A..Aa‘. They complained to the relevant authorities as well as to Home Minister Nayani Narsimha Reddy. The issue was communicated to the team and the Reddy names have been cut from the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu