»   » ఫొటో పెట్టీ... మళ్ళీ తీసేసి... అసలు రెజీన ఎంగేజ్మెంట్ నిజమా కాదా

ఫొటో పెట్టీ... మళ్ళీ తీసేసి... అసలు రెజీన ఎంగేజ్మెంట్ నిజమా కాదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెలబ్రిటీలు ఏం చేసినా అదో సంచలనమే అయిపోతుంది అందునా హీరోయిన్ల పెళ్ళి వార్త అయితే ఇంక చెప్పేదేముందీ అబ్బాయిల గుండేల్లో కలుక్కుమనే వార్త కాబట్టి మరింత షాకింగ్ న్యూస్ అవుతుంది.. ఈ మధ్య యువ హీరోల పెళ్లిళ్ల విషయం లోమ్నూ అటుమీడియా ఇటు సామాన్య జనమూ కాస్త ఎక్కువ ఆసక్తే చూపిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ హాట్ న్యూస్ ప్రభాస్ పెళ్లే అన్న విషయం తెలిసిందే కదా...

ఆమధ్య అల్లు హీరో శిరీశ్ కూడా త్వరలో నాకు శ్రీరస్తూ శుభమస్తూ అంటూ ట్వీట్ చేయగానే ఆ పోస్ట్ కి విపరీతమైన స్పందన వచ్చింది. తర్వాత అది శిరీశ్ సినిమా అప్డేట్ అని తెలియగానే అంతా లైట్ తీసుకున్నారనుకోండి అది వేరే విషయం... ఇక అనుష్క పెళ్ళి మ్యాతరైతే ఒక రేంజి లో పాపులర్ అయ్యింది.... ఇక ఇప్పుడు రెజీనా వంతు.. అయితే శిరీశ్ లాగే సినిమా పబ్లిసిటీ కోసం ఏదైనా గిమ్మిక్ చేస్తోందా.. లేక నిజమే మాట్లాడుతోందా అన్నది అర్థం కాలేదు కానీ.. ఈ రోజు ఇన్స్టాగ్రాంలో ఆమె పెట్టిన ఫొటో.. దాని గురించి చేసిన కామెంట్లు సంచలనం రేపాయి.

Regina Cassandra got engaged???

ఒక అబ్బాయితో ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగించుకున్న ఫొటోను ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది రెజీనా. అందులో కేవలం చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. దీనికి వెడ్డింగ్ బెల్స్ అనే హ్యాష్ ట్యాక్ జోడించింది రెజీనా. ''గయ్స్.. ఈ శుభ సందర్భంలో నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఇది ఇలా జరిగినందుకు సారీ. ఆ వ్యక్తి ఎవరో మీకు చెప్పాలనుకుంటున్నా. కానీ అందుకు ఇంకొంచెం సమయం పడుతుంది. మీరందరూ అతణ్ని ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఎదురు చూస్తున్నా"" అని మెసేజ్ పెట్టింది రెజీనా.

ఇక వెంటనే కామెంట్ల ప్రవాహం వెల్లువెత్తింది. పెళ్ళి సంగతి అనగానే కొన్ని వందల ట్వీట్లు ప్రవాహం లా వచ్చి పడ్డాయి. అయితే మళ్ళీ ఏమీందో ఏమోగానీ కొద్ది సేపటికే ఆ పోస్ట్ తీసేసింది కానీ అప్పటికే చాలామంది రెజీనా పెళ్ళి అంటూ పోస్ట్లు పెట్టేసారు.. అయితే ఈవిషయమై అసలు సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్ననార్త్ ఇండియా అంతటా 'కర్వచౌత్' అంటూ చాలా పవిత్రంగా భావించే రోజును పండుగగా చేసుకున్నారు. ఈ పండుగను దృష్టిలో పెట్టుకుని జనానికి కొద్దిసేపు షాక్ ఇద్దామని ఈడస్కి బ్యూటీ ఇంత వ్యవహారం నడిపింది అని, లేదు అది ఆమె నటించే ఒక తమిళ సినిమా ప్రమోషన్ లో భాగంగానే అనీ ఆమె హార్డ్ కోర్ అభిమనుల ఉవాచ.. మొత్తానికి ఒక రోజంతా టాలీవుడ్ ని తికమక పెట్టేసింది రెజీనా...

ఈమధ్యన రెజీనా సాయి ధరమ్ తేజ్ లు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ కొన్ని మీడియా వర్గాలలో వార్తల హడావిడి కూడ జరిగింది. ఈవార్తలు రెజీనా దృష్టి వరకు వెళ్ళడంతో రెజీనా తన మనసులోని పెద్ద కుటుంబం కోడలి కోరికను బయట పెట్టిందనుకోవాలి. ఇదే సందర్భంలో ఈమె మాట్లాడుతూ తనకు ఒంటరి తనం అంటే ఇష్టం లేదని అందువల్లనే తాను చాలామందితో స్నేహం చేస్తూ ఉంటానని ఈ స్నేహం వల్ల కొంతమందికి అపార్ధాలతో అనుమానాలు ఏర్పడి ఏవేవో ఊహించుకుని వార్తలు వ్రాస్తారని అలాంటి వాటిని తాను పట్టించుకోను అని అంటూ ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల పైనే అంటూ ఓ క్లారిటీ పడేసింది... ఏపని నిజమో...ఏది పబ్లిసిటీ కోసమో తెలియకుందా తికమకలో పడేస్తారు కదా ఈ సెలబ్రిటీలు...

English summary
The Twitterati got a huge shock when the hot and happening Regina Cassandra posted a tweet a short while ago saying that she has got engaged. This news has spread like wildfire and created ripples all over the social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu