»   » హీరోయిన్ రెజీనా షోరూం ఓపినింగ్ లో దారుణం... అభిమాని సజీవ దహనం

హీరోయిన్ రెజీనా షోరూం ఓపినింగ్ లో దారుణం... అభిమాని సజీవ దహనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా హీరోయిన్లు అంటే అందరకి క్రేజే. వారిని చూసేందుకు అభిమానులు ఎంతగా ఉత్సాహం మనం చిన్నప్పుటినుంచీ చూస్తున్న విషయమే. అయితే అభిమానం కూడా ప్రాణం తీసిందనే విషయాలు వింటనే గుండె తరుక్కుపోతుంది.

శనివారం నాడు గుంటూరులో సినిమా హీరోయిన్ పై ఉండే అభిమానం ఓ యువకుడి ప్రాణం తీసింది. అంతా చూస్తుండగానే అతడు సజీవ దహనమయ్యాడు. వివరాల్లోకి వెళితే... సినీ నటి రెజీనా శనివారం నాడు గుంటూరు నగరంలోని లక్ష్మీపురం మెయిన్ రోడ్డుపై నీరూస్ షోరూమ్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు జరుగుతుండగా అపశ్రుతి చేటుచేసుకుంది. గుంటూరు నగరంలో నీరూస్ షోరూం ప్రారంభానికి వస్తుందని తెలిసి అక్కడికి పెద్దఎత్తున యువకులు చేరుకున్నారు.

ఆ షోరూం ప్రక్కనే పెద్ద ఫ్లెక్సీని కూడా పెట్టారు. యువకులంతా ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో కొద్దిపాటి తోపులాట మొదలైంది. ఈ క్రమంలో విజయ్ అనే యువకుడు షోరూం ప్రక్కనే వున్న ఫ్లెక్సీని పట్టుకున్నాడు. ఆ ఫ్లెక్సీ ప్రక్కనే వున్న ట్రాన్సఫార్మర్‌కు తగులుకోవడంతో విజయ్‌కు షాక్ కొట్టింది. దాంతో అతడు కిందపడిపోయాడు.

Regina Cassandra opening Neeru’s at Guntur, one dead and injured

ట్రాన్స్ ఫార్మర్ నుంచి మంటలు చెలరేగి ఫ్లెక్సీకి అంటుకుని అది అతడిపై పడి మంటలు వ్యాపించాయి. అంతా చూస్తుండగానే అతడు సజీవ దహనమయ్యాడు. అతడిని మంటల నుంచి కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ప్రయత్నంలో మరో యువకుడు కూడా గాయాలపాలయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే... మరో వాదన మీడియాలో ప్రచారం అవుతోంది. షోరూమ్ ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా ఓ భారీ ఫ్లెక్సీ కట్టే ప్రయత్నంలో.. పైనున్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఫ్లెక్సీకి అమర్చిన ఐరన్ ఫ్రేమ్ కి తగలడంతో కరెంట్ షాక్ కొట్టి మరణించాడంటున్నారు. ఇరవై ఏళ్ళ ఆలేటి మహేష్ అనే యువకుడు దుర్మరణం పాలవటంతో గుంటూరు టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇదే సమయంలో యువకుడికి కరెంట్ షాక్ తగలగానే.. అక్కడున్న వాళ్ళు కర్రతో ఫ్లెక్సీని పక్కకు లాగే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక్కసారిగా గాలికి ఆ ఫ్లెక్సీ తిరిగి హైటెన్షన్ తీగలపై పడటంతో మహేష్ శరీరంపై మంటలు చెలరేగి సజీవ దహనమయ్యాడని చెప్తున్నారు.

పిడుగురాళ్లకు చెందిన సదరు యువకుడు మహేష్ తాజా షోరూమ్ ఏర్పాటు చేసిన భవనానికి ఏడాది కాలంగా వాచ్ మెన్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది. చివరకు ఇలా మహేష్ హఠాత్పరిణామం కారణంగా మృతి చెందడంతో.. షాప్ ఓపెనింగ్ కోసం ఆహ్వానం మేరకు వస్తోన్న రెజీనా విషయం తెలుసుకుని షాక్ కి గురై వెనుదిరిగినట్లు సమాచారం. చివరగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

English summary
Regina Cassandra went to Guntur to open Neeru’s showroom. The crowd rushed to see Regina and all of a sudden a tragic incident happened.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu