»   » లిప్ లాక్ క్వీన్... పొగడ్తో, తిట్టో అర్థం కాదంటోన్న హీరోయిన్!

లిప్ లాక్ క్వీన్... పొగడ్తో, తిట్టో అర్థం కాదంటోన్న హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ రెజీనా వచ్చిన కొత్తలోనే లిప్ లాక్ సీన్లతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై లిప్ లాక్ క్వీన్ అనే ముద్ర పడిపోయింది. తనను లిప్ లాక్ క్వీన్ అని పిలవడంపై రెజీనా ఇటీవల ఓ ఇంటర్యూలో స్పందించారు. ఇది బిరుదు అనుకోవాలో, తిట్టు అనుకోవాలో నాకు అర్థం కాదు. నేను చేసిన డజను సినిమాల్లో రెండు మూడు సినిమాల్లో సన్నివేశం డిమాండ్ చేసింది కాబట్టి లిప్‌లాక్‌ సీన్లలో నటించాను. ఆ మాత్రం దానికే నన్ను అలా అనేస్తే ఎలా? అని ప్రశ్నిస్తోంది.

న్యూ ఇయర్ వేడుకల విషయంలో ఎలాంటి ప్లాన్స్ వేసుకుంటున్నారు? అనే ప్రశ్నకు స్పందిస్తూ....ఆ సమయానికి చెన్నైలో ఉంటానో, షూటింగ్‌లో ఉంటానో తెలీదు. నాకైతే షూటింగుకు వెళ్లకూడదనే ఉంది. అప్పటి వరకు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు అని రెజీనా చెప్పుకొచ్చింది.

Regina said....don't call me lip-lock queen

తాను పద్నాలుగు సంవత్సరాల వయసులోనే సినిమాల్లోకి వచ్చాను. వెండితెరకు రాకముందు షార్ట్‌ ఫిలిమ్స్‌లో చేశాను. చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టం. కాకపోతే సినిమాల్లో చేయాలని మాత్రం అనుకోలేదు. 2009లో తమిళ సినిమా ద్వారా అవకాశం వచ్చిందని రెజీనా తెలిపింది.

కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ.....అమ్మ కర్నాటకకు చెందిన వ్యక్తి. నాన్నది నార్త్‌ ఇండియా. మా గ్రాండ్‌ఫాదర్‌ అయ్యంగార్లే అయినా క్రిస్టియన్‌గా మారిపోయారు. మా కుటుంబం అంతా క్రిస్టియానిటీనే పాటిస్తున్నాం. ఐదేళ్ల తర్వాతే నేను పెళ్లి గురించి ఆలోచిస్తాను. నన్ను నన్నుగా అర్థం చేసుకునే వ్యక్తి అయితే చాలంటోంది రెజీనా.

English summary
"I might have locked lips in just couple of movies, while I've acted in nearly a dozen movies. How could you call me a lip lock queen then?" Regina said.
Please Wait while comments are loading...