»   » ఊహించని ఆనందం : 1966తర్వాత మళ్ళీ ఇప్పుడు... తెలుగులో మళ్ళీ సినిమా

ఊహించని ఆనందం : 1966తర్వాత మళ్ళీ ఇప్పుడు... తెలుగులో మళ్ళీ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న రేఖ గురించి మనలో చాలా మందికి తెలుసు. గ్లామర్ తారగా రేఖ ఎందరో అభిమానులను సంపాదించుకుంది. అయితే రేఖ తల్లి గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. రేఖ తల్లి పుష్పవల్లి కూడా నటిగా మంచి పేరు తెచ్చుకుంది.బాలీవుడ్ లో తన అందంతో అభిన‌యంతో అంద‌రి మ‌న‌సులును ఆక‌ట్టుకున్న న‌టి రేఖ... బాలీవుడ్ లో త‌న సౌంద‌ర్య‌తో కుర్ర‌కారును ఒక ఊపు ఉపింది.

త‌ను వెండితెర మీద క‌న‌బ‌డితే చాలు సినిమాలు సూప‌ర్ హిట్. వెండితెర మీద తిరుగులేని నటిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో... వ్యక్తిగత జీవితంలో కూడా అదే రేంజిలో ఎన్నో సంచలనాలున్నాయి! అప్పట్లో ఆమె పెళ్లి వ్యవహారం వివాదాస్పదం అయింది. బాలీవుడ్ భాద్షాగా పిల‌బ‌డే అమితాబ్ తో ప్రేమ వ్యవహారం అప్ప‌టో చర్చనీయాంశమైంది. ఇలా రకరకాల ఎఫైర్లు - రూమర్లు - చీవాట్లూ చెప్పుదెబ్బలు ఆమె వ్యక్తిగత జీవితంలో చీకటి కోణాలు ఇలా అన్నిటినీ తట్టుకుంటూనే తాను ఒక అగ్రనటిగా ఎదిగింది అయితే ఇంత సాధించిన రేఖ కి ఇప్పటికీ నెరవేరని కోరిక ఒకటుంది... అదే తన మాతృ భాష అయిన తెలుగులో నటించటం

Rekha in Telugu after 50 years

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. రేఖ త్వరలో ఒక తెలుగు చిత్రంలో నటించనున్నారు. నిజమే ఎవర్‌గ్రీన్‌ నటి రేఖ ఎన్నో ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లో నటించబోతోంది. బాలనటిగా దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచయమైన రేఖ.. 1966లో 'రంగుల రాట్నం'లో బాలనటిగా కన్పించారు.

ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయిన రేఖ మళ్లీ ఏ తెలుగు చిత్రంలోనూ కన్పించలేదు. ఇప్పుడు తెలుగులో రాబోతున్న ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రంలో రేఖ నటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో మొత్తం మూడు తరాలను చూపించబోతున్నారు. జయమ్ము నిశ్చయమ్మురా ఫేం పూర్ణ ఈ విషయం చెప్తూ అందులో ఓ తరాన్ని నలుపు తెలుపులో తీయనున్నట్లు తెలిపారు. సినిమాలో రేఖకు తల్లి పాత్రలో తాను నటిస్తున్నట్లు పూర్ణ మీడియాకు వెల్లడించారు.

English summary
Veteran Bollywood actress Rekha is going to make her comeback in Telugu after 50 years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X