»   » రేలంగి తనయుడు సత్యనారాయణ కన్నుమూత

రేలంగి తనయుడు సత్యనారాయణ కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Relangi Satyanarayana Babu Passes Away
హైదరాబాద్: హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య తనయుడు రేలంగి సత్యనారాయణ బాబు గుండెపోటుతో కన్నుమూశారు. నగరంలోని ఇందిరా పార్క్ సమీపంలోని స్వగృహంలో ఉంటున్న ఆయనకు బుధవారం తెల్లవారు జామున గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ.. ఈలోగానే ఆయన తుదిశ్వాస విడిచారు.

రేలంగి దంపతులకు సత్యనారాయణ ఒక్కగానొక్క సంతానం. సత్యనారాయణకు ఊహ తెలిసేనాటికే రేలంగి సినిమాల్లో బిజీగా ఉన్నారు. తండ్రి బాటలో నటనారంగంలోకి అడుగు పెడదామనే ఉద్దేశ్యంతో నాటకాల్లో నటించారు. మూడుసార్లు ఉత్తమ నటుడిగా మొదటి బహుమతి గెలుచుకున్నారు. 'బాలానందం' అనే సినిమాతో హీరోగా సినిమా రంగ ప్రవేశం చేసారు.

తాడేపల్లి గూడెంలో ఓ థియేటర్ కట్టించి సినిమాలొద్దు...దాన్ని చూసుకో అని తండ్రి చెప్పడంతో....ఆయన కోరిక మేరకు తనకు ఎంతో ఇష్టమైన నటనా రంగాన్ని వదిలి పెట్టిన సత్యనారాయణకు 'బాలానందం' మొదటి, చివరి సినిమా అయింది. అప్పటి నుండి థియేటర్, ఆస్తులు చూసుకోవడానికే పరిమితం అయ్యారు సత్యానారాయణ.

ప్రస్తుతం సత్యనారాయణ చిన్న కొడుకు హేమంత నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. తనతో ఎప్పటి కైనా ఓ సినిమా నిర్మిస్తాను. నిర్మాత కావాలనే నా కలను నెరవేర్చుకుంటాను అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సత్యనారాయణ. ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నమూయడం అందరినీ కలిచి వేస్తోంది.

English summary
Comedy legend Relangi Venkata Ramaiah’s son Satyanarayana Babu has passed away. He suffered from severe Heart Attack on today morning in his home and shifted to hospital immediately. But he left his last breath before reaching hospital.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu