For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెద్ద తెలుగు సినిమాల రిలీజ్ డేట్స్

  By Srikanya
  |

  ఇప్పటివరకూ ఖరారు అయిన పెద్ద తెలుగు సినిమా రిలీజ్ డేట్స్ ని వరసగా చూస్తే....

  సెవెంత్ సెన్స్ (డబ్బింగ్) అక్టోబర్ 26

  సూర్య,శృతి హాసన్ జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని మురగదాస్ రూపొందించారు. ఈ చిత్రం ఇప్పటికే క్రేజ్ తెచ్చుకుంది. తమిళ తో సమానంగా తెలుగులోనూ ఎక్కువ ధియోటర్స్ లో విడుదల కానుంది.గజనీ తర్వాత సూర్య,మురగదాస్ కాంబినేషన్ లో రెడీ అయిన ఈ చిత్రంపై ప్రేక్షకుల అంచనాలు సైతం భారీగానే ఉన్నాయి.

  మొగుడు నవంబర్ 4 వ తేదీ

  గోపీచంద్,తాప్సీ జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని కృష్ణవంశి రూపొందించారు. రీసెంట్ గా ఆడియో విడుదలైన ఈ చిత్రాన్ని గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన నల్లమలుపు బుజ్జి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మన వివాహ వ్యవస్ధ గొప్పతనాన్ని వివరిస్తూ తయారైన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకర్షించే చిత్రం అవుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.యాక్షన్ ఇమేజ్ లో ఉన్న గోపీచంద్ ఈ చిత్రంలో ఫ్యామిలీలకు దగ్గరయ్యే అవకాసం ఉంది

  బెజవాడ నవంబర్ 18

  నాగచైతన్య,అమలా పౌల్ జంటగా నూతన దర్శకుడు వివేక్ రూపొందిస్తున్న చిత్రం బెజవాడ. రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ వివాదంతో ఇప్పటికే మార్కెట్లో కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది. దడతో యాక్షన్ హీరో గా ఎంట్రీ ఇవ్వలేకపోయిన నాగచైతన్య ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

  శ్రీరామ రాజ్యం నవంబర్ 10

  నందమూరి బాలకృష్ణ,నయనతార జంటగా బాపు రూపొందించిన చిత్రం శ్రీరామ రాజ్యం. అప్పటి లవకుశ చిత్రానికి రీమేక్ గా చెప్పబడుతున్న ఈ చిత్రం పౌరాణిక చిత్రాలను ఆదరించేవారికే కాక అందరి అభిమానం చూరుగుంటుదనే ఆశతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఆడియో అన్ని వర్గాల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది.

  గంగ ది బాడీగార్డ్ నవంబర్ నెలాఖరకు

  వెంకటేష్,త్రిష జంటగా గోపీచంద్ మలినేని రూపొందించిన చిత్రం గంగ ది బాడీగార్డ్. మళయాళంలో విజయవంతమైన బాడీగార్డ్ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో రూపొంది వరస పరాజయాలతో ఉన్న వెంకటేష్ కు మళ్లీ హిట్ ఇస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

  జర్ని (డబ్బింగ్)నవంబర్ నెలాఖరకు

  శర్వానంద్ నటించిన తమిళ చిత్రాన్ని తెలుగులో జర్ని పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మురగదాస్ తమిళంలో నిర్మించటం,అక్కడ విజయం సాధించటం జరిగింది.

  పంజా డిసెంబర్ 9

  పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా. తమిళ దర్శకుడు విష్ణు వర్దన్ దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రం స్టైలిష్ ఎంటర్టైనర్ గా రూపొందింది. భిళ్లా వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కాబట్టి ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గెటప్ తో విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరినీ అలరిస్తోంది.

  రాజన్న డిసెంబర్ 23

  ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలు చేయటానికి ఇష్టపడే నాగార్జున తాజా చిత్రం రాజన్న. విజయేంద్రప్రసాద్ దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాజమౌళి డైరక్ట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమమాకు హైలెట్గా నిలుస్తాయంటున్నారు. ఈ చిత్రంలో నాగార్జున తెలంగాణా కు చెందిన పోరాట యోధుడుగా కనిపించి అలరించనున్నారు.

  ది బిజెనెస్ మ్యాన్ జనవరి 11, 2012

  దూకుడుతో జోరు మీదున్న మహేష్ బాబు తాజా చిత్రం ది బిజెనెస్ మ్యాన్. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పోకిరి రికార్డులను బ్రద్దలు కొట్టే అవకాశం ఉండే విధంగా రూపొందుతోందని చెప్తున్నారు.ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథ లో హీరోయిన్ గా కాజల్ కనిపించనుంది.

  పూల రంగడు జనవరి 13, 2012

  సునీల్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం పూల రంగడు. అహనా పెళ్లంట వంటి కామిడీని డైరక్ట్ చేసిన వీరభద్ర చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు రూపొందిస్తున్నారు.

  నిప్పు జనవరి 12, 2012

  రవితేజ,గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నిప్పు. వైవియస్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో యాక్షన్ మిక్స్ తో రూపొందుతోంది. ఈ చిత్రం గుణశేఖర్ కి మళ్లీ లైమ్ లైట్ లోకి నిలబెట్టే చిత్రం అవుతుందని చెప్తున్నారు.

  English summary
  Many Big Star telugu films ready to relase with craze.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X