For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్యాన్ నుంచి తప్పించుకున్న'రాజన్న'..నాగ్ రిలీఫ్

  By Srikanya
  |

  నాగార్జున తాజా చిత్రం రాజన్న పై బ్యాన్ పెడతారేమో అని గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోన్న సంగతి తెలిసిందే. దానికి కారణం..రాజన్న దర్శకుడు విజయేంద్రప్రసాద్ పై బ్యాన్ పెట్టడమే.ఆయన కొందరు దర్శకులను మోసం చేసారనే ఆరోపణలపై బ్యాన్ పెట్టారు. అయితే నాగార్జున రాజన్న చిత్రాన్ని మాత్రం బ్యాన్ నుంచి మినహా ఇస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఇక రాజన్న విషయానికి వస్తే... డిసెంబర్ 23 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్‌లో రాజమౌళి కృషి సూపర్బ్.క్లైమాక్స్ ఈ సినిమాకు హైలైట్ అవుతుంది అంటూ నాగార్జున రాజమౌళి పనితనం గురించి చెప్పుకొచ్చారు. నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం 'రాజన్న'. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ "ఈ చిత్రంలోని రాజన్న క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. స్వాతంత్ర సమరయోధుడి కథ ఇది. అప్పటి యథార్థ సంఘటనలు కొన్నింటిని తీసుకుని తెరకెక్కిస్తున్నాం. విజయేంద్రప్రసాద్‌గారు చాలా బాగా డీల్ చేశారు. కీరవాణిగారి సంగీతం ప్రాణం. అత్యంత కీలకమైన పాత్రలో ఎనిమిదేళ్ళ బేబి ఏని నటన సూపర్బ్.

  అలాగే ఈ కథలో పాప పాత్రకు ప్రాముఖ్యత ఉంది. ఎన్నో సెట్లు వేసి స్వాతంత్య్ర పోరాటం నాటి వాతావరణాన్ని క్రియేట్ చేశాం. ఆర్ట్ డైరక్టర్ రవీందర్ సెట్స్‌ని అద్భుతంగా వేశారు. మా సంస్థలో వస్తున్న ప్రెస్టీజియస్ చిత్రమిది. చిత్ర నిర్మాణం పూర్తి కావచ్చింది. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. పేట్రియాటిక్ ఫీల్‌తో సాగుతుంది. నటుడిగా సంతృప్తినిచ్చిన సినిమా అని అన్నారు.ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా డిసెంబర్ 23 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కినేని అన్నపూర్ణమ్మ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో స్నేహ, బేబి ఏని, శ్వేత మీనన్, నాజర్, అజయ్, సుప్రీత్, ప్రదీప్ రావత్, ముఖేష్ రుషి, రవి కాలే, గాంధీ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు.ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శ్యామ్.కె.నాయుడు, అనిల్ బండారి, పూర్ణ, కళ: రవీందర్, ఫైట్స్: విజయ్, రామ్‌లక్ష్మణ్, సెల్వ, సాల్మన్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, యాక్షన్ పర్యవేక్షణ: రాజమౌళి, నిర్మాత: అక్కినేని నాగార్జున, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: విజయేంద్రప్రసాద్.

  English summary
  Nagarjuna's Rajanna has come to an end, as the Andhra Pradesh Film Chamber of Commerce has given green signal for its release. However, it has banned director and the father of SS Rajamouli, S Vijayendra Prasad for cheating a few producers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X