Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అకీరా తన డాడీ, పెదనాన్న సినిమాలే చూస్తాడనుకుందట!.. కానీ ఆ విషయంలో రేణూ దేశాయ్‌కి షాక్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాపై వెల్లువెత్తున ప్రశంసల సంగతి తెలిసిందే. సాధారణ ప్రేక్షకులే కాకుండా సెలెబ్రిటీలు సైతం ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్యపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంపై రేణూ దేశాయ్ ఓ సుధీర్ఘమైన పోస్ట్ చేసింది. అన్నింటి కంటే అకీరా నందన్ ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తికరంగా వీక్షించడం రేణూ దేశాయ్‌ను ఆశ్చర్యానికి గురి చేసిందట. ఇదే విషయాన్ని చెబుతూ ఓ పోస్ట్ చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్..
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ హల్చల్ చేసే రేణూ దేశాయ్.. ఆద్య, అకీరా నందన్‌ల గురించే చెబుతుంది. ఆద్యకు అది ఇష్టం, అకీరా ఇలా ఉంటాడు, అలా అల్లరి చేస్తుందంటూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా అకీరా గురించి, అతను చూసే సినిమా గురించి రేణూ దేశాయ్ ఓ కామెంట్ చేసింది.

వాళ్ల డాడీ సినిమాలే..
ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాను వీక్షించిన అనంతరం రేణూ దేశాయ్ స్పందిస్తూ.. ‘అకీరా, నేను నిన్న రాత్రి ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చూశాం. వాళ్ల డాడి, పెదనాన్న, అన్నయ్యల కమర్షియల్ చిత్రాలు చూసే అలవాటున్న ఓ పదహారేళ్ల అబ్బాయి.. ఈ సినిమా చూడలేడు మధ్యలోనే లేచిపోతాడని నేను అనుకున్నాను. ఇలాంటి సెన్సిటివ్ సినిమాలు నచ్చవని భావించాను. పది నిమిషాలు చూసి బయటకు వెళ్లిపోతాడని అనుకున్నా.

ఆశ్చర్యపోయాను..
కానీ నన్ను ఆశ్చర్యపరిచాడు. సినిమాను ఆసాంతం ఆస్వాధించాడు. అందులోని హాస్యం, కథను చెప్పిన విధానం వల్ల అకీరా తన సమయాన్ని అందులో ఇన్వెస్ట్ చేశాడు. పాత్రలో లీనమై మరీ చూశాడు. దర్శకులైన మాకు ఎప్పుడూ ఒకటి వింటుంటాం. యంగ్ జనరేషన్‌కు కమర్షియల్ చిత్రాలే ఇష్టమని, కమర్షియల్ అంశాలు లేకపోతే యూత్ సినిమాలు చూడరని అంటుంటారు.
Recommended Video

బలంగా నమ్ముతున్నాను..
కానీ అది తప్పని నేను బలంగా నమ్ముతున్నాను, మంచి చిత్రాలకు వయసుతో సంబంధం లేదు. మన మంచి చిత్రాలు తీయాలి ఆపై ప్రేక్షకులకే వదిలేయాలి. వారు వాటిని చూస్తారా? లేదా? అన్నది వారినే డిసైడ్ చేసుకోనివ్వాలి' అని రేణూ దేశాయ్ పేర్కొంది.