»   » బద్రికి 17 ఏళ్లు.. అదో చేదు జ్ఞాపకం.. కన్నీళ్లు ఆగలేదు.. రేణు దేశాయ్..

బద్రికి 17 ఏళ్లు.. అదో చేదు జ్ఞాపకం.. కన్నీళ్లు ఆగలేదు.. రేణు దేశాయ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి బద్రి సినిమా ఓ మధురమైన గుర్తు. పవన్ కల్యాణ్‌తో రేణు కలిసి నటించిన తొలి చిత్రం. అంతేకాకుండా టాలీవుడ్ ‌కు పరిచయమైన మొట్టమొదటి సినిమా. బద్రి సినిమా రేణుదేశాయ్ సినీ, వ్యక్తిగత జీవితాన్ని మలుపుతిప్పిన సినిమా. అలాంటి సినిమా విడుదలై ఏప్రిల్ 20 తేదీకి 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఓ చేదు జ్ఞాపకాన్ని రేణు దేశాయ్ గుర్తు చేసుకున్నది.

17 ఏళ్ల క్రితం...

17 ఏళ్ల క్రితం...

17 ఏళ్ల క్రితం బద్రి సినిమాకు సంబంధించిన సీన్‌ను షూట్ చేస్తున్నారు. ఆ సమయంలో నాకు పుణే నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. దాంతో నా కళ్ల వెంట నీరు ఆగలేదు. తీవ్ర విషాదానికి గురి అయ్యాను. కానీ షూటింగ్ జరుగుతుండటం వల్ల ఆ వార్తను మనసులోనే దాచుకొన్నాను అని రేణు దేశాయ్ ట్వీట్ చేసింది.

 యాక్సిడెంట్‌లో ఫ్రెండ్ మరణం..

యాక్సిడెంట్‌లో ఫ్రెండ్ మరణం..

ఆ ఫోన్ కాల్ సారాంశమేమింటంటే .. పుణేలో నా స్నేహితురాలు బైక్ యాక్సిడెంట్‌లో దుర్మరణం చెందింది. ఆమె చనిపోయిందనే వార్తతో దు:ఖం పొంగుకొచ్చింది. కళ్లలో నుంచి నీరు ఆగలేదు. కానీ పాట షూటింగ్ జరుగుతున్నది. నా బాధను గుండెలోనే పెట్టుకొని నటించాను. బాధను ఆపడం ఓ దశలో నా తరం కాలేదు అని రేణు దేశాయ్ వెల్లడించింది.

షూటింగ్ చేస్తూనే బాధ..

షూటింగ్ చేస్తూనే బాధ..

ఆ సమయంలో బాధను దాచుకొన్న నా కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. అందుకు సాక్ష్యం ఈ ఫోటోనే అని రేణుదేశాయ్ ఆ ఫోటోను ట్వీట్ చేసింది. ప్రేమ ఒక్కటే భూమి మీద అన్నీ కాదు. ప్రతీ బంధంలోనూ విశాలమైన ప్రేమను పొందడానికి అవకాశం ఉంటుంది అని ఓ కవితను పోస్ట్ చేసింది.

 ఆ కవిత అర్థం ఏమిటంటే..

ఆ కవిత అర్థం ఏమిటంటే..

నీవు సూర్యుడివి.. రోజు ప్రకాశవంతంగా కనిపిస్తావు...
నీవు చంద్రుడివి.. ప్రతీ రోజు చాలా అందంగా ఉంటావు.
నీవు గాలివి.. నేను ప్రతీ రోజు పీల్చుకొంటాను.
నీవు ఓ వస్త్రానివి.. ప్రతీ రోజు నేను నా ఒంటిపై కప్పుకొంటాను.
నా ప్రతీ ఉదయం టీ.. అర్ధరాత్రి ఓ కప్పు కాఫీ సర్వసాధారణం
బాధలు.. సంతోషం జీవితంలో భాగం..
నేను నిన్ను కోల్పోయావననే విషయం కంటే.
నీవు నాకు దూరం అయ్యావనే బాధ ఎక్కువగా ఉంటుంది
నా హృదయ స్పందనల మధ్య ఎప్పుడూ ఉంటావు.
నీ కోసం నా కళ్లు ఎప్పుడూ వెతుకుతుంటాయి
-- రేణు

. ప్రేమ, పెళ్లి, విడాకులు..

. ప్రేమ, పెళ్లి, విడాకులు..

బద్రి సినిమా షూటింగ్ సందర్భంగా పవన్, రేణు దేశాయ్‌లు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత చాలా కాలం సహజీవనం చేసిన వారు పెళ్లి కూడా చేసుకొన్నారు. కొన్ని వ్యక్తిగత, అభిప్రాయ బేధాల వల్ల పవన్, రేణు విడాకులు తీసుకొన్న సంగతి తెలిసిందే. అయితే వారి మధ్య బంధాలు, ప్రేమానురాగాలు ఉన్నట్టు చాలా సందర్భాలు రుజువు చేశాయి. ప్రస్తుతం రేణు తన కూతురు, కొడుకుతో కలిసి పుణేలో ఉంటుంది.

English summary
Pawan Kalyan, Renu Desai's Badri Movie completed 17 years. In this occassion, Renu desai tweet with tragedy incident that taken place in the time of Badri shooting. She shares her feeling towards her friend who was met accident in Pune.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu