»   »  రేణు దేశాయ్.... యాడ్ ఫిల్మ్‌లో ఇలా!

రేణు దేశాయ్.... యాడ్ ఫిల్మ్‌లో ఇలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్...సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో పలు కార్పొరేట్ బ్లాండ్లకు ఆమె ప్రచారం చేసారు. అందులో అప్పటి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బిపిఎల్ ఒకటి. అందుకు సంబంధించిన పోస్టర్ ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం పాత జ్ఞాపకాలను చూసుకుంటూ మురిసి పోతోంది రేణు దేశాయ్.

ఆ తర్వాత రేణు దేశాయ్ బద్రి సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడటం, పెళ్లి..పిల్లలు తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో విడిపోయిన ఆమె సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా, దర్శకురాలిగా తన టాలెంటు నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.

Renu Desai in BPL ad

రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన ‘ఇష్క వాలా లవ్' ఇంకా విడుదలకు నోచు కోవడం లేదు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ మరాఠీలో ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తన కూతురు పేరు మీద 'శ్రీ ఆద్య ఫిలింస్', కొడుకు పేరు మీద ‘అకీరా ఫిల్మ్స్' అనే సినీ నిర్మాణ సంస్థలను స్థాపించింది. ఇప్పటికే 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే చిత్రాన్ని నిర్మించి విజయం సొంతం చేసుకున్న రేణు దేశాయ్ తాజాగా ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.

ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. గతేడాది అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించినా....ఇప్పటికీ విడుదల కాలేదు.

English summary
Popular brand BPL isn't existent today but when it is popular to its peaks in 1998, top models in the country have competed with each other to become the face of brand. At that time, BPL has picked up an young Marathi lady who just entering the modelling world. It is none other Renu Desai, ex-wife of hero Pawan Kalyan.
Please Wait while comments are loading...