For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కల్యాణ్ ఇచ్చింది కాదు.. ఒక్కో రూపాయి కూడబెట్టి కొనుక్కున్నా.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

  |

  రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ చట్టప్రకారంగా విడిపోయినా కొంతమంది మాత్రం ఇంకా వారిద్దర్నీ ఒకటిగానే చూస్తుంటారు. వదినా అంటూ రేణు దేశాయ్‌ను పిలుస్తుంటారు. వీటిపై ఎన్నో సార్లు రేణు దేశాయ్ కూడా స్పందించింది. అలా పిలిస్తే పిలవండి కానీ.. ఆయనతో మాత్రం ముడిపెట్టకండనీ ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది. రేణు దేశాయ్ పవన్ వ్యవహారం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటుంది.

  బంగ్లా కొనిచ్చాడంటూ వార్తలు వైరల్..

  బంగ్లా కొనిచ్చాడంటూ వార్తలు వైరల్..

  పవన్ కళ్యాణ్ తన పిల్లలు అకీరా నందన్, ఆద్యలకు ఓ ఖరీదైన బంగ్లాను కొనిచ్చాడంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. గచ్చిబౌలి ఏరియాలో దాదాపు ఐదారు కోట్లు పెట్టి విలాసవంతమైన బంగ్లాను కొనిచ్చాడని వైరల్ అయ్యాయి. దీనిపై రేణు దేశాయ్ స్పందిస్తూ ఎమోషనల్ అయింది.

  సుదీర్ఘమైన పోస్ట్..

  సుదీర్ఘమైన పోస్ట్..

  రేణు దేశాయ్ స్వతహాగా రచయిత కావడంతో తన బాధను, మనోవేదనను ఎంతో అందంగా, ఎవ్వరినీ నొప్పించడంగా చెప్పుకొచ్చింది. తానిప్పుడు అందరికీ ఓ విషయం గురించి వివరణ ఇవ్వడానికి ఒకే ఒక్క కారణమని తెలిపింది. నిన్నటి నుంచి తనకు మీడియా వాళ్ళ నుంచి, స్నేహితుల నుంచి వస్తున్న ఎన్నో మెసేజెస్, ఫోన్ కాల్స్ ఆధారంగా తనకీ విషయం చాలా సీరియస్ అయిందని తెలిసినట్టుగా పేర్కొంది. వాళ్ళు చెప్పింది విని తనకు చాలా బాధ వేసిందని అందుకే ఈ వివరణ అంటూ కవితాత్మకంగా తన బాధను వివరించింది.

  ఇప్పటికీ ఒంటరిగానే..

  ఇప్పటికీ ఒంటరిగానే..

  ‘ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన ఆత్మగౌరవం... ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన నిజాయితీ... ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన అస్తిత్వం... ఇది మీకు తెలియనిదా??!! నేను, నా జీవిత మనుగడ కోసం ఒంటరిగా, తీవ్రంగా, నిబద్దతతో ఎంతగానో శ్రమిస్తున్నాను... శ్రమిస్తూనే పోరాడుతున్నాను...

  ఏదీ ఆశించలేదు.. పొందలేదు..

  ఏదీ ఆశించలేదు.. పొందలేదు..

  నేనిప్పటివరకూ కనీసం మా తండ్రి గారి దగ్గర్నుంచి కూడా ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించలేదు, పొందలేదు... అలాగే, నేనిప్పటివరకూ నా మాజీ భర్త దగ్గర్నుంచికూడా ఎలాంటి అన్యాయపూరితమైన భరణాన్నీ ఆశించలేదు, పొందలేదు... అది నా వ్యక్తిత్వం!!!

  నా కష్టార్జితంతో కొనుకున్నాను..

  నా కష్టార్జితంతో కొనుకున్నాను..

  అయినప్పటికీ మీరు నా గురించి అన్యాయంగా, అసంబద్దమైన అబద్దపు వార్తలను ప్రచారం చేస్తూనే ఉన్నారు! మీరందరూ అనుకుంటున్నట్టూ, ప్రచారం చేస్తున్నట్టూ ఇప్పుడు హైదరాబాద్‌లో నేను కొన్న ఫ్లాట్ నిజంగా మాకెవరూ కొనివ్వలేదు. అది నా కష్టార్జితంతో ఒక్కో రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న నా సొంత ఇల్లు

  ఈ వార్తలు ఆయను చేరి ఉండవు..

  ఈ వార్తలు ఆయను చేరి ఉండవు..

  అది నా మాజీ భర్త మాకు కొనిచ్చారన్న ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల నా నిజాయితీకీ, ఆత్మగౌరవానికీ, నా అస్థిత్వానికీ, చివరగా నా ఉనికికే ప్రమాదం సంభవిస్తుందనే చిన్న ఆలోచన మీకెవ్వరికీ రాలేదా??? నాకు తెలిసినంతవరకూ, ఈ వార్తకూ నా మాజీ భర్తకూ ఎలాంటి సంబంధం ఉండి ఉండదు... కనీసం ఈ ప్రచారం ఆయన దృష్టికి కూడా వెళ్ళి ఉండదు...

  ఎంత వరకు సమంజసం..

  ఎంత వరకు సమంజసం..

  అలాంటిది, ఒక వార్తను రాసేటప్పుడు, అది నిజమో కాదో నిర్ధారించుకోకుండానే, అత్యుత్సాహంతోనో, తొందరపాటుతోనో, లేక మీ సంస్థల మనుగడకోసమో, ఒక ఒంటరి స్త్రీ మనుగడను ప్రమాదంలో నెట్టడం ఎంతవరకూ సమంజసం?

   గౌరవం మసకబారదా..?

  గౌరవం మసకబారదా..?

  ఇలాంటి వార్తలు ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయో మీకు తెలియదా?? ప్రజలు ఈ అబద్దపు వార్తను నిజమని నమ్మితే, సంఘంలో నాకున్న గౌరవం మసకబారదా?? ఏది జరిగినా చెక్కు చెదరని నా అస్థిత్వం, వ్యక్తిత్వం, నా ఆత్మగౌరవం, నేను అనే ఒక నిజం అసత్యం అయిపోదా??

  ఎలాంటి గొడవలు సృష్టించకండి..

  ఎలాంటి గొడవలు సృష్టించకండి..

  నా ఆత్మ ఎంత ఘోషిస్తుంది!! ఎంతలా చితికిపోతుంది!!? దయచేసి ఆలోచించండి... నా ఈ జీవితంలో ఇప్పటివరకూ ఏ మగవాడి సాయం లేకుండా సాగుతున్న నాలాంటి ఒంటరి తల్లి జీవన గమనానికీ, పోరాటానికి గౌరవం ఇవ్వకపోయినా సరే... దయచేసి, ఇలా కించపరచకండి... నేను మీతో పంచుకుంటున్న ఈ బాధను సరిగ్గా అర్థం చేసుకోకుండా మళ్ళీ నాకూ, నా మాజీ భర్త అభిమానులకూ మధ్య, దయచేసి ఎలాంటి గొడవలూ సృష్టించకండి...

  English summary
  Renu Desai Condemn Rumors ABout Pawan Kalyan Gift A Flat. rumors Spead That Pawan Kalyan Bought A New House For Akira Nandan In Hyderabad. Renu Desai Condemn That Those Are Falls News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X