»   » పవన్ ఫ్యాన్స్‌పై రేణుదేశాయ్ ఫైర్.. అప్పుడు నాకు 19 ఏళ్లు..

పవన్ ఫ్యాన్స్‌పై రేణుదేశాయ్ ఫైర్.. అప్పుడు నాకు 19 ఏళ్లు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై సినీ నటి రేణుదేశాయ్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్న మెగా అభిమానులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో తీసుకొన్న తొందరపాటు నిర్ణయాల్లో పవన్ కల్యాణ్‌ను పెళ్లి చేసుకోవడం ఒకటని ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ అభిమానులు పవన్ మాజీ భార్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

నిజమైన ఫ్యాన్స్ అలా ప్రవర్తించరు

నిజమైన ఫ్యాన్స్ అలా ప్రవర్తించరు

పవన్ కల్యాణ్ అభిమానులు చేస్తున్న కామెంట్లపై ఇటీవల రేణుదేశాయ్ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. ‘కల్యాణ్ గారి నిజమైన అభిమానులు, ఫాలోవర్స్ మహిళలను దూషించారు. ముఖ్యంగా ఇద్దరి పిల్లలకు తల్లినైన నాలాంటి మహిళపై అలాంటి వ్యాఖ్యలు చేయరు' అని రేణు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

నాపై పవన్ ఫ్యాన్స్ దాడి సరికాదు..

నాపై పవన్ ఫ్యాన్స్ దాడి సరికాదు..

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పేరుతో నాపై చేస్తున్న దాడి సరికాదు. మొరల్ కీపర్స్ పేరుతో నన్ను ద్వేషించడం తగదు. అలాంటి వారు ఇప్పటికీ మారరు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పుడు నా వయస్సు 19 ఏళ్లు..

అప్పుడు నా వయస్సు 19 ఏళ్లు..

‘పవన్ కల్యాణ్‌ను 2000 సంవత్సరంలో వివాహం చేసుకొన్నప్పుడు నా వయస్సు 19 ఏళ్లు. ఆ తర్వాత చాలా రోజులకు చట్టబద్దంగా పెళ్లి జరిగింది. తొలిసారి నిర్ణయం తీసుకొన్నప్పుడు నా మానసిక పరిస్థితిని అంచనా వేయవచ్చు' అని రేణుదేశాయ్ అన్నారు.

 ఇంటర్నెట్ ఓ సాధనం కాకూడదు

ఇంటర్నెట్ ఓ సాధనం కాకూడదు

మహిళలను వేధించడానికి ఇంటర్నెట్ ఓ సాధనం కాకూడదదని రేణుదేశాయ్ అన్నారు. నెకెడ్ అనే షార్ట్ ఫిలింకు సంబంధించిన నగ్న దృశ్యాలు సోషల్ మీడియాలో లీక్ కావడంపై ఆమె స్పందించారు. నెకెడ్ షార్ట్ ఫిలింలో నటించిన కల్కి కోచ్లిన్, రితాబరీ దృశ్యాలకు సంబంధించిన వీడియో లింక్‌ను ఆమె ట్వీట్ చేశారు.

English summary
Pawan Kalyan ex wife Renu desai said True fans and followers of Kalyangaru will never be abusive towards any lady!Especially for d mother of his kids.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu