»   » పవన్ కళ్యాణే విడాకులు అడిగారు, అదో నరకం, వేధింపులు భరించాను: రేణు దేశాయ్

పవన్ కళ్యాణే విడాకులు అడిగారు, అదో నరకం, వేధింపులు భరించాను: రేణు దేశాయ్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Renu Desai Comments On Pawan Kalyan

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ విడిపోయిన తర్వాత ఆయన విదేశీ మహిళను మరో పెళ్లి చేసుకోవడం, ఆవిడ ద్వారా పిల్లల్ని కూడా కనడం తెలిసిందే. దాదాపు 8 సంవత్సరాల పాటు తన ఇద్దరు పిల్లల పెంపకంలో మునిగిపోయి పూణెలో ఒంటరిగా జీవితం గడుపుతున్న రేణు దేశాయ్.... పెద్దలు, ఫ్యామిలీ మెంబర్స్ సూచన మేరకు తన జీవితానికి కూడా ఒక మగ తోడు అవసరం అనే నిర్ణయానికి వచ్చి రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. ఆ నిర్ణయంతో రేణు దేశాయ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  మరో పెళ్లి చేసుకుంటే అతడిని చంపేస్తామనపి కూడా కొందరు రేణు దేశాయ్‌ను బెదిరించారు. ఆ బెదిరింపులకు భయపడి తనకు కాబోయే భర్త వివరాలు బయటకు రాకుండా రహస్యంగా ఎంగేజ్మెంట్ వేడుక జరుపుకున్నారు. త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో రేణు దేశాయ్ తన చుట్టూ ఉన్న నెగెటివిటీని తగ్గించుకునేందుకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

  అందుకే ఇంత రహస్యంగా...

  అందుకే ఇంత రహస్యంగా...

  నేను గత సంవత్సరం రెండో పెళ్లి చేసుకుంటాననే నా ఆలోచన వ్యక్తం చేసినపుడు చాలా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అతడిని చంపేస్తాం అని కొందరు దారుణంగా బెదిరించారు. అందుకే నా సెకండ్ మ్యారేజ్ విషయాలు, నాకు కబోయే భర్త వివరాలు రహస్యంగా ఉంచాను. ఆయనకు కూడా తన పేరు ముందే బయటకు రావడం ఆసక్తి లేదు.

  అరేంజ్డ్ మ్యారేజ్

  అరేంజ్డ్ మ్యారేజ్

  మాది ఆరేంజ్డ్ మ్యారేజ్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కలిసి సెట్ చేశారు. ఆయన కూడా డైవర్స్ అయిన వ్యక్తి. ఇద్దరూ కలిసి కొత్త జీవితం ప్రారంభిస్తే బావుటుందని అంతా అన్నారు. ఆయన ఇంత కాలం యూఎస్ఏలో ఉన్నారు. అంతకు ముందు మా ఇద్దరి మధ్య పెద్దగా పరిచయం కూడా లేదు. వాళ్ల నాన్నకు బాగోలేక పోవడం వల్ల పూణె షిప్టయిపోయారు. అప్పటి నుండి ఆయనతో పరిచయం ఏర్పడింది.

  వారు చెప్పడంతో రెండో పెళ్లి గురించి ఆలోచించా

  వారు చెప్పడంతో రెండో పెళ్లి గురించి ఆలోచించా

  నాకు విడాకులు జరిగి 8 సంవత్సరాలైంది. మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు గత సంవత్సరం వరకు లేదు. అయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా ఎంతకాలం ఒంటరిగా ఉంటావు అని అడగటం మొదలు పెట్టినపుడు ఎందుకు మరో పెళ్లి చేసుకోకూడదను అనే ఆలోచన వచ్చింది.

   అదో నరకం...

  అదో నరకం...

  సింగల్ మదర్‌గా ఇద్దరు పిల్లలను పెంచడం అంటే నరకంలా ఉంటుంది. ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. డైవర్స్ సమయానికి పిల్లలు పెద్దయి స్కూలుకు వెళుతున్నారంటే అంత కష్టం ఉండేది కాదేమో. నాకు డైవర్స్ అయినపుడు అకిరా చిన్న పిల్లాడు, ఆద్య స్మాల్ బేబీ. ఇద్దరు పిల్లలను ఒకదాన్నే హ్యాండిల్ చేశాను. దానికి కష్టం అనే పదం వాడటం చాలా చిన్నది.

  సుఖ పడతాను అనే సమయానికి కష్టాల్లోకి

  సుఖ పడతాను అనే సమయానికి కష్టాల్లోకి

  ఆ సమయంలో మనసుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కళ్యాణ్ గారు, నేను కలిసి ఉన్నపుడు కూడా ఎన్నో కష్టాలు భరించాను. ఆయన ఎప్పుడూ సినిమాలు, పొలిటికల్ మీటింగులతో బిజీగా ఉండేవారు. కష్టాలన్నీ అయిపోయి జీవితం సుఖమయం అవుతుంది అనే సమయంలో విడాకులు జరిగాయి. మళ్లీ కష్టాల్లోకి వచ్చాను.

  నా బాధ ఎవరికీ పట్టదు, అందుకే మౌనం

  నా బాధ ఎవరికీ పట్టదు, అందుకే మౌనం

  ఇంత కాలం నేను మౌనంగా ఉండటానికి కారణం..... నేను ఏదైనా మాట్లాడితే అది నా బాధ అని ఎవరూ పట్టించుకోరు. కళ్యాణ్ గారు పెద్ద యాక్టర్, పొలిటీషియన్ కాబట్టి దాన్ని రాజకీయం చేస్తారు. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి చెడుగా మాట్లాడారు అని హెడ్ లైన్స్ లో వచ్చేస్తోంది. నా బాధలు, కష్టాలన్నీ సైడ్ అయిపోతాయి. అందుకే మౌనంగా ఉండిపోయాను.

  ఏ తప్పు చేయకున్నా వేధింపులు ఎదుర్కొన్నా

  ఏ తప్పు చేయకున్నా వేధింపులు ఎదుర్కొన్నా

  నేనే ఆయన్ను వదిలేశానంటూ కొందరు సోషల్ మీడియాలో వేధించడం మొదలు పెట్టారు. మరో వైపు ఆయన ఎక్స్ హీరోల అభిమానుల నుండి కూడా వేధింపులు ఉండేవి. వారు వారు పోట్లాడుకుంటూ నన్ను చట్నీ చేసేవారు. నేను ఏ తప్పూ చేయకున్నా ఇబ్బంది పడ్డాను.

  డబ్బు పిచ్చి మనిషి అని, ఆయన్ను వదిలేసి వెళ్లిపోయావు అని తిట్టేవారు

  డబ్బు పిచ్చి మనిషి అని, ఆయన్ను వదిలేసి వెళ్లిపోయావు అని తిట్టేవారు

  నాకు అసలు సోషల్ మీడియాలో రావాలనే ఉద్దేశ్యం లేదు. అయితే నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన తర్వాత అవి ఓపెన్ చేయక తప్పలేదు. అప్పటి నుండి వేధింపులు మొదలయ్యాయి. నేను డబ్బు పిచ్చి మనిషి అని, ఆయన్ను వదిలేసి వెళ్లిపోయాను అని చాలా బూతులు తిట్టేవారు.

  కళ్యాణ్ గారి నుండి కరెక్ట్ స్టేట్మెంట్ వస్తే ఇలా ఉండేది కాదు

  కళ్యాణ్ గారి నుండి కరెక్ట్ స్టేట్మెంట్ వస్తే ఇలా ఉండేది కాదు

  మీ దగ్గరి నుండి ఒక కరెక్ట్ స్టేట్మెంట్ వస్తే నాకు ఈ బాధలు తగ్గుతాయని కళ్యాణ్ గారిని అడిగాను. కానీ ఆయన నుండి ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు.

  వాళ్లు బ్యాగ్రౌండ్ చెక్ చేశారు

  వాళ్లు బ్యాగ్రౌండ్ చెక్ చేశారు

  చాలా ఇంటర్వ్యూల్లో ఎవరు ముందు డైవర్స్ అడిగారు అనే ప్రశ్న ఎదురైంది. కానీ నేను ఎక్కడా చెప్పలేదు. మాది అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి వాళ్లు బ్యాగ్రౌండ్ చెక్ చేశారు. వాళ్లకు చాలా విషయా తెలిశాయి. వారు నన్ను అపుడు ఒకటే అడిగారు నీ తప్పు లేనపుడు నువ్వు ఎందుకు భరిస్తున్నావని. దానికి నేను సమాధానం చెప్పలేక పోయాను.

  ఆయనే విడాకులు అడిగారు

  ఆయనే విడాకులు అడిగారు

  నేను విడాకులు ముందు అడగలేదు. కళ్యాణ్ గారే ముందు డైవర్స్ కావాలన్నారు. ఈ విషయం నాకు, ఆయనకు, ఆ దేవుడికే తెలుసు. ఆ సమయంలో ఇద్దరి మధ్య చాలా వాదన జరిగింది. ఆయన డైవర్స్ కావాలని తెగేసి చెప్పారు. నేను కూడా ఇచ్చేస్తాను అని చెప్పేశాను.

  ఇపుడు చెప్పడానికి కారణం

  ఇపుడు చెప్పడానికి కారణం

  ఆ విషయాలన్నీ ఇపుడు మాట్లాడటం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆయన ఇపుడు రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఇది నా కోసం, నా ఫ్యూచర్ కోసం చెబుతున్నాను. నిజాన్ని ఎందుకు దాచాలి, ఎందుకు భయపడాలి. నిజాన్ని దాచడం వల్ల ఇకపై ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఈ విషయం బయటకు చెబుతున్నాను అని రేణు దేశాయ్ తెలిపారు.

  English summary
  "I am starting a new chapter of my life and I would like all the blessings and good wishes possible. This interview is not about Kalyan Garu or me talking negative about him. This interview is my letting go of my past and my closure. And I would take this opportunity to again sincerely thank everyone who have stood by me and given me the strength to believe that I have a chance at life again." Renu Desai said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more