»   » అయ్యో...: గాయపడిన రేణు దేశాయ్(ఫొటో)

అయ్యో...: గాయపడిన రేణు దేశాయ్(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అవును, రేణు దేశాయ్ గాయపడింది. అయితే అంత డేంజర్ కాకపోయినా బాగా చీరుకుపోయింది. కాలి పాదంపై అయిన ఈ గాయం గురించి రేణు దేశాయ్ ఈ ఫొటో పెట్టి ఇలా రాసుకొచ్చింది. "నేను గత ఆరు నెలలుగా సినిమాలు చేయటంలో బిజీగా లేను కానీ...దెబ్బలు తగిలించుకోవటంలో బిజీగా ఉన్నాను...నేను ...హాస్పటిల్ క్లోజ్ ఫ్రెండ్స్ లాగ ఉన్నాము.." అంటూ రాసుకొచ్చింది. అయితే ఎందుకు ఇలా జరిగిందనేది మాత్రం తెలియచేయలేదు. తన కుమార్తె ఆధ్య 5 వ పుట్టిన రోజుకు కొద్ది రోజులు ముందుగా ఈ గాయం అవటం బాధాకరమే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Renu Desai injured

రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన ‘ఇష్క వాలా లవ్' ఇంకా విడుదలకు నోచు కోవడం లేదు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ మరాఠీలో ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తన కూతురు పేరు మీద 'శ్రీ ఆద్య ఫిలింస్', కొడుకు పేరు మీద ‘అకీరా ఫిల్మ్స్' అనే సినీ నిర్మాణ సంస్థలను స్థాపించింది. ఇప్పటికే 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే చిత్రాన్ని నిర్మించి విజయం సొంతం చేసుకున్న రేణు దేశాయ్ తాజాగా ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.

ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. గతేడాది అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించినా....ఇప్పటికీ విడుదల కాలేదు.

English summary
Renu Desai got Injured. Apart from sharing the picture, Renu wrote, "And when I am not busy making films, I am busy making injuries...me&hospital have become best friends last 6 months".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu