»   » తన ప్రెండ్ ని పరిచయం చేసిన రేణు దేశాయ్ (ఫొటో)

తన ప్రెండ్ ని పరిచయం చేసిన రేణు దేశాయ్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొదటి నుంచీ రేణు దేశాయ్ ..జంతు ప్రేమికురాలు. ఆమెకు కుక్కపిల్లలన్నా, పక్షులన్నా విపరీతమైన ఇష్టం. తన ఖాళీ సమయాన్ని వీటితో గడుపుతూ రిలాక్స్ అవుతూంటారామె. తాజాగా రేణు దేశాయ్ తన ఫ్రెండ్ అంటూ ఈ ఫొటోని షేర్ చేసింది. నా క్యూట్ ఫ్రెండ్ టెన్సింగ్ కు హాయ్ చెప్పండి. నా మెడపై వాలి, నా మిర్చి ని తినేస్తుంది అంటూ ఆమె రాసుకొచ్చారు. ఇక్కడ ఆ ఫొటోని చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య రేణుదేశాయ్‌కి ఇపుడు పార్టీ టైం. ఇద్దరూ కలిసి సోమవారం జరిగే ఓ పార్టీలో సంతోషంగా గడప బోతున్నారు. ఆల్రెడీ విడిపోయిన ఇద్దరూ కలవడం ఏమిటి, పార్టీ చేసుకోవడం ఏమిటి అనుకుంటున్నారా?..... భార్య భర్తలుగా విడిపోయినా వీరు తల్లిదండ్రులుగా తమ బాధ్యత నిర్వర్తించాలి కదా! అందుకే ఇదంతా...

అసలు విషయంలోకి వెళితే.... పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ ముద్దుల కూతురు ఆద్యా సోమవారం 5వ పుట్టినరోజు జరుపుకోబోతోంది. రేణు దేశాయ్ తన కూతురు కోసం చిన్నపాటి పార్టీ హోస్ట్ చేస్తున్నారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

Renu Desai introduces her Friend to the World!

తన ముద్దుల కూతురు బర్త్ డే గురించి రేణు దేశాయ్ వివరిస్తూ...‘బర్త్ డే గర్ల్ సోమవారం 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఆద్యతో కలిసి షాపింగ్ వెళ్లాను. బర్త్ డే కోసం స్పెషల్ డ్రెస్ తీసుకున్నాను' అంటూ రేణు దేశాయ్ వెల్లడించారు. బర్త్ పార్టీ భారీగా ఏర్పాటు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ..‘బర్త్ డే పార్టీ పెద్దగా ఏమీ చేయడం లేదు. ఇంట్లోనే చిన్నగా ఏర్పాటు చేస్తున్నాం. ఇళ్లు లేని వారికి అన్నదానం చేయాలనుకుంటున్నాం' అన్నారు.

పవన్ కళ్యాణ్ తన తన ముద్దుల కూతురు బర్త్ డే కోసం గిఫ్టు కొనే ఉంటాడని పలువురు అభిప్రాయ పడుతున్నారు. తన పిల్లలకు సంబంధించిన ఏ కార్యక్రమాన్నిపవన్ కళ్యాణ్ మిస్ కారు. ఆ మధ్య ఆద్య చదువుతున్న స్కూలుకు వెళ్లి స్వయంగా కూతురు డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసారు పవన్ కళ్యాణ్.

English summary
Renu Desai shared the above picture and wrote, "Say hi to my cute friend Tensing, who loves to hang out on my 'neck' & steal my mirchi's frm my food! (my friends bird)".
Please Wait while comments are loading...