»   » పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ సీక్వెల్, నిర్మాత రేణు దేశాయ్!

పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ సీక్వెల్, నిర్మాత రేణు దేశాయ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషి' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. 2001లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ అప్పట్లో కలెక్షన్లు ఇరగదీసింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించబోతోందని తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నిర్మాత, దర్శకురాలు రేణు దేశాయ్ సహ నిర్మాతగా వ్యవహరించబోతోందని తెలుస్తోంది. ఇటీవల న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా రేణు దేశాయ్ ని కలిసిన సూర్య... ఈ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహహాన్ సంగీతం అందించబోతున్నారట. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడనుందని అంటున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో బిజీగా ఉన్నారు. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గుజరాత్ షెడ్యూల్ పూర్తి కావడంతో నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేసారు. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నేతృత్వంలో రూ.5 కోట్ల వ్యయంతో భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ ఒక ఏరియాలా ఉంటుందని టాక్. 20 రోజులపాటు ఇక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తెలుగు సినిమా చరిత్రలో భాగా ఖర్చు పెట్టిన సెట్లలో ఇదీ ఒకటిగా పేర్కొంటున్నారు.

Renu Desai to produced Khushi sequel with Pawan

మార్చి నెలకి చిత్రీకరణ పూర్తి చేసి, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. పవనకల్యాణ్‌ సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. పవనకల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైనమెంట్‌ ప్రై.లి, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఏప్రిల్ 8, 2016లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. సమ్మర్ ట్రీట్ గా ఈ చిత్రం అలరించనుందని,అప్పుడైతే వేసవి శెలవలు కలిసి వస్తాయని టీమ్ భావిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రాయ్ లక్ష్మీ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రతో పాటు స్పెషల్ సాంగుతో ప్రేక్షకులను అలరించనుంది.

English summary
Source said that, SJ Suriya has developed a sequel script of 'Khushi' to direct Pawan once again. The movie will be produced by Eros International and is likely to be co-produced by Renu Desai. It is learnt that the director and Renu Desai recently met each other to discuss about the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu