»   » ఎన్టీఆర్, రానా.... నెక్ట్స్ పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ టీవీ షో!

ఎన్టీఆర్, రానా.... నెక్ట్స్ పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ టీవీ షో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు ఎంటర్టెన్మెంట్ అంటే టాప్‌లో ఉండేది సినీమా రంగమే. ప్రస్తుతం బుల్లితెర రంగం కూడా సినిమా రంగంతో పోటీ పడే స్థాయి వచ్చింది. తెలుగులో నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్, రానా లాంటి స్టార్స్..... హిందీలో అమితాబ్, సల్మాన్, అక్షయ్ లాంటి సూపర్ స్టార్స్ టీవీ షోలు చేయడమే ఇందుకు నిదర్శనం.

త్వరలో మరో ప్రముఖ సెలబ్రిటీ బుల్లితెర రంగం వైపు రాబోతున్నారు. ఆవిడ మరెవరో కాదు..... పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణు దేశాయ్. ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో ఈ వార్త ఇపుడు హాట్ టాపిక్ అయింది.

తెలుగులో టీవీ షో

తెలుగులో టీవీ షో

రేణు దేశాయ్ తెలుగులో ఓ టీవీ షో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగులో ‘బిగ్ బాస్', ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' లాంటి రియాల్టీ షోలను టెలికాస్ట్ చేస్తున్న స్టార్ మాటీవీ వారే.... రేణు దేశాయ్ షోను ప్రసారం చేయబోతున్నారట.

షో కాన్సెప్టు ఏమిటి?

షో కాన్సెప్టు ఏమిటి?

రేణు దేశాయ్ హోస్ట్ చేయబోతున్న ఈ టీవీ షో ఓ డాన్స్ రియాల్టీ షో అని తెలుస్తోంది. హిందీ డాన్స్ రియాల్టీ షో ‘నచ్ బలియే' మాదిరిగా ఈ షో ఉంటుందని సమాచారం. తెలుగులో ప్రారంభం అయ్యే ఈ డాన్స్ రియాల్టీ షోకు రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తుందని టాక్.

రేణు దేశాయ్‌

రేణు దేశాయ్‌

రేణు దేశాయ్‌కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆమెకు ఫాలోవర్స్ కూడా ఎక్కువే. మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానుల నుండి ఆమెకు మంచి సపోర్ట్ ఉంది.

స్టార్ మాటీవీ

స్టార్ మాటీవీ

తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో స్టార్ మాటీవీ ఇప్పటికే వైవిధ్యమైన టీవీ షోలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ షోలకు రేణు దేశాయ్ షో కూడా తోడయితే ఇక మాటీవీకి తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో తిరుగు ఉండదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
As per the latest buzz Pawan Kalyan ex-wife Renu Desai is getting ready to host a TV show on a Telugu channel soon. This TV show is going to be the Telugu version of successful Hindi dance show 'Nach Baliye'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu