»   » నాకొడుకు మరో పవన్ కళ్యాణ్ కాకూడదు : కలకలం రేపిన రేణూ దేశాయ్ ట్వీట్

నాకొడుకు మరో పవన్ కళ్యాణ్ కాకూడదు : కలకలం రేపిన రేణూ దేశాయ్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ విషయం అయినా వెంటనే టాక్ అఫ్ ది టౌన్ అయిపోతుంది. పవన్ తన వ్యక్తిగత జీవితం గురించి బయటకి చెప్పడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించక పోయినా మీడియా కి కానీ ఫ్యాన్స్ కి కానీ ఆవిషయాలు చాలా ఇంపార్టెంట్. చాలామంది పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ మాజీ భార్య రేణు పేస్ బుక్, ట్విట్టర్ ఎకౌంట్లను ఫాలో అవుతుంటారు.విడిపోయినప్పటికీ అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువస్తూంటారు రేణూ.

సోషల్ మీడియాలో పిల్లల గురించి పోస్టింగ్స్..

సోషల్ మీడియాలో పిల్లల గురించి పోస్టింగ్స్..

సోషల్ మీడియాలో ఆమె పవన్ గురించి పోస్ట్ లు చేస్తూ ఉంటారు. పవన్ కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్య ల విశేషాలు అప్పుడప్పుడూ రేణు దేశాయ్ షేర్ చేస్తుంది కదా. అలానే తనకి బర్త్ డే విషెస్ చెప్తూ పెట్టిన ఒక ట్విట్తర్ పోస్ట్ మరింత ఆసక్తికరంగా మారింది... 'నా కొడుకు ఎప్పటికీ జూనియర్‌ పవర్‌స్టార్‌ కాకూడదని కోరుకుంటున్నాన'ని ట్వీట్‌ చేసింది.

13 ఏటా అఖీరా నందన్

13 ఏటా అఖీరా నందన్

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ తమ తనయుడు అఖీరానందన్ పుట్టిన రోజు సందర్భంగా పెట్టిన ఈ ట్వీట్ ఇప్పుడు అభిమానుల్లో ఇంట్రస్టిగ్ టాపిక్. తమ కుమారుడు పదమూడవ యేట అడుగు పెట్టిన ఆనందంలో ఉన్న ఆ తల్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా తన తనయుడి ఎదుగుదల గురించి ఆమె తన ఆకాంక్షను వ్యక్తం చేసింది.

 టీనేజర్‌గా మారడాన్ని..

టీనేజర్‌గా మారడాన్ని..

అకీరాకు ఇప్పుడు 13. అయితే ఇప్పుడే అకీరా ఆరడుగుల టీనేజర్‌గా మారడాన్ని నమ్మలేకపోతున్నా. అకీరా తల్లిదండ్రుల నీడలోనే ఉండకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఈరోజు దేవుణ్ని కోరుకుంటున్నా. తను భవిష్యత్తులో జూనియర్‌ పవర్‌స్టార్‌గా కాకుండా అకీరా నందన్‌గా గుర్తింపు పొందుతాడని నాకు నమ్మకముంది. హ్యాపీ బర్త్‌డే మై స్వీట్‌ లిటిల్‌ హార్ట్‌ అకీరా' అని రేణు ట్వీట్‌ చేసింది.

 గత నెల ఆద్య పుట్టిన రోజు వేడుకకు పవన్

గత నెల ఆద్య పుట్టిన రోజు వేడుకకు పవన్

గత నెల తన కూతురు ఆద్య పుట్టిన రోజు వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. మాజీ భార్య రేణు దేశాయ్ నివాసంలో జరిగిన వేడుకకు పవన్ హాజరుకావడం మీడియాలో ప్రాధాన్యంగా మారింది. ఆ తర్వాత కొద్ది రోజులకే తన మరో కూతురు బర్త్ డే వేడుకల్లో పవన్ పాల్గొన్న సంగతి తెలిసిందే.

English summary
13!!!!! Still can't believe my little one is a 6foot tall teenager!!! I am truly at loss of…" Tweets Renu Desai
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu