»   »  ప్రత్యేక హోదా రాజ్యాంగ హక్కు.. స్పందించిన పవన్ మాజీ భార్య

ప్రత్యేక హోదా రాజ్యాంగ హక్కు.. స్పందించిన పవన్ మాజీ భార్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏపీ ప్రత్యేక హోదాపై ఉద్యమిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ బాసటగా నిలిచింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి భారత రాజ్యాంగం హక్కులను కల్పించిందని ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతూ ఆమె ట్వీటర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Renuu desai reacted on ap special status

'68 ఏండ్ల క్రితం దేశ పౌరులందరికీ గణతంత్ర, ప్రజాసామ్య విధానం భారత రాజ్యాంగం హక్కులు కల్పిచింది' అని #APDemandsSpecialStatus ట్యాగ్‌తో ట్వీట్ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై తెలుగు పరిశ్రమలోని హీరోయిన్లు, మహిళా నటీమణులు పెదవి విప్పని నేపథ్యంలో రేణుదేశాయ్ తన గళాన్ని వినిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆమె ట్వీట్‌పై పలువురు స్పందించడమే కాకుండా దానిని రీట్వీట్ కూడా చేశారు.

English summary
Renuu desai supports AP special status. She said its constitutional right
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu