For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాగబాబు వెన్నుపోటు, ‘మా’ డబ్బు ఖాళీ చేశాడు, కులం ఏంటి? : శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్, సంచలన కామెంట్స్!

|

ప్రముఖ తెలుగు నటుడు, 'మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్' మాజీ అధ్యక్షుడు శివాజీ.. మెగాబ్రదర్ నాగబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. 'మా' ఎన్నికల్లో నాగబాబు కారణంగా ఓడిపోయిన ఆయన ఆ మధ్య ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లోనే త్వరలోనే అతడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన భీవరంలో మీడియా ముందుకు వచ్చారు. ఇది నేను ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు. ఒక పది హేను రోజులు రాత్రింభవళ్లు ఆలోచించాను. నేను చేసేది కరెక్టా? కాదా? అని ఆలోచించాను. ఇలా చేయడం వల్ల మా అన్నయ్య, నాకు దేవుడితో సమానమైన మెగాస్టార్ చిరంజీవిగారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచించాను. కానీ మా భీమవరం ప్రజల కోసం తప్పడం లేదు..... అంటూ శివాజీ రాజా తన మనసులో మాట బయట పెట్టారు.

ఏమీ ఆశించకుండా మెగా ఫ్యామిలీతో ఉన్నా...

ఏమీ ఆశించకుండా మెగా ఫ్యామిలీతో ఉన్నా...

‘‘నేను మెగా ఫ్యామిలీతో గత 32 సంవత్సరాల పాటు మద్రాసు నుంచి ఈ రోజు వరకు ఏమీ ఆశించకుండా ఉన్నాను. బయట హీరోలందరి దగ్గర పదేసి సినిమాలు చేసినా కూడా ఆ ఫ్యామిలీలో ఎవరితోనూ ఇంత వరకు ఒక సినిమా కూడా చేయలేదు. నేనెప్పుడూ అడగలేదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అనేది నాది, మెగాస్టార్ నా సొంత అన్నయ్య.. అది చాలు అనుకున్నాను. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ మధ్యలో ఈ నాగబాబు అనే వ్యక్తి గత 5 సంవత్సరాల నుంచి పూర్తిగా మారిపోయారు. పెద్దాయన్ను, చిన్నాయన్ను చూస్తే ఎంత పాజిటివ్ నెస్ ఉంటుందో, నాగబాబులో అంత నెగెటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది.'' అని శివాజీ రాజా తెలిపారు.

నాగబాబుకు ఓటేస్తే నష్టపోతాం

నాగబాబుకు ఓటేస్తే నష్టపోతాం

‘‘మద్రాస్ నుంచి నిన్నమొన్నటి వరకు నాగబాబు నేను కలిసే ఉన్నాం. ప్రెస్ మీటుకు వచ్చే ముందుకు కూడా నాకు అన్నయ్య చిరంజీవి, పద్మగారు, వరుణ్, నిహారిక గుర్తొచ్చారు. వెళితే కరెక్టా? కాదా? అనిపించింది. మనకెందుకులే ఈ బాధ ఎన్నికల తర్వాత వద్దామని ఒక ఐదు రోజులు ఫ్యామిలీతో బయటకు వెళ్లిపోయాను. నిన్న వచ్చాక యూట్యూబ్‌లో నాగబాబు ప్రసంగాలు చూశాను. మా తాత ముత్తాతల నుంచి కూడా మేమంతా భీమవరంలోనే పుట్టాం. నా ఊరిని నేను కాపాడుకోవాలి, నా నరసాపురం నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి... ఒక మంచి వ్యక్తికి ఓటేయండి, నాగబాబు లాంటి వ్యక్తికి ఓటేస్తే నష్టపోతాం అని చెప్పడానినికే ఇక్కడికి వచ్చాను. ఇలా చెప్పే హక్కు ఆ ప్రాంత వాసిగా నాకే ఎక్కువ హక్కు ఉంది.'' అని శివాజీ రాజా తెలిపారు.

‘మా' డబ్బును ఖాళీ చేశాడు

‘మా' డబ్బును ఖాళీ చేశాడు

నాగబాబుకు ఎందుకు ఓటు వేయవద్దు అంటున్నానంటే.. నాగబాబు ‘మా' అధ్యక్షుడిగా పోటీ చేసినపుడు 600 మంది సభ్యులు ఉన్నారు. అతడికి ఉన్న బ్యాగ్రౌండ్, ఆయన స్థాయికి ‘మా'ను ఎక్కడో తీసుకెళ్లి ఉండొచ్చు. కానీ అంతకు ముందు ఉన్న ప్రెసిడెంట్స్ తెచ్చిన డబ్బును నిల్ చేసి పెట్టాడే తప్పితే ఇతడు చేసింది ఏమీ లేదు. 2 సంవత్సరాలు పదవిలో ఉండి... అసోసియేషన్‌ను రెండు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. అలాంటి వ్యక్తి మా నరసాపురం ఎంపీ అయితే అన్ని లక్షల మందిని ఇతడు బాగు చేస్తాడా? అనే డౌట్ వచ్చింది.

బ్రూటస్ అంటే గుండు కొట్టించుకున్న నాగబాబులా ఉంటాడు

బ్రూటస్ అంటే గుండు కొట్టించుకున్న నాగబాబులా ఉంటాడు

30 ఏళ్ల స్నేహంలో నాగబాబు ఏమిటో నాకు తెలుసు. యూటూ బ్రూటస్ అనే వ్యక్తి పేరు వినడమే కానీ చూడలేదు. బ్రూటస్ అంటే గుండు కొట్టించుకున్న నాగబాబులా ఉంటాడు. ఈ మాట అనడానికి నాకు బాధగా ఉంది. కానీ అనాలి. ఆ రోజు నాగబాబు రాత్రికి రాత్రి వెళ్లిపోయి ఎవరైతే మన మెగా ఫ్యామిలీని తిట్టారో వాళ్ల మధ్యలో కూర్చుని మాకు అపోజిట్‌గా సపోర్ట్ చేస్తున్నాం అన్నపుడు నాకు బాధేసింది, ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు.

ఇలా వెన్నుపోటు పొడుస్తాడనుకోలేదు

ఇలా వెన్నుపోటు పొడుస్తాడనుకోలేదు

మెగా ఫ్యామిలీకి కొన్ని కోట్ల మంది ప్రాణమిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. అందులో నేనూ ఒకడిని.. ఇలా వెన్నుపోటు పొడుస్తాడనుకోలేదు. వాళ్లు నెగ్గారు.. నెగ్గిన తర్వాత ప్రమాణ స్వీకారం జరిగిన 5 నిమిషాలకే ఏమైంది? అది తెలుసుకున్నాక అయినా నాగబాబు వార్నింగ్ ఇవ్వద్దా? వారం తర్వాత వాళ్లే మళ్లీ మన ఫ్యామిలీని తిడుతున్నారు ఇదైనా పట్టించుకోరా? అంటే మన ఫ్యామిలీని తిట్టేవారు మీకు మంచోళ్లు, మన ఫ్యామిలీని ప్రాణపదంగా చూసుకునే వారు మీ దృష్టిలో చెడ్డవారా?

నాగబాబు కులం గురించి మాట్లాడారు

నాగబాబు కులం గురించి మాట్లాడారు

మా భీమవరంలో నాగబాబు కులం అనే పదం ఉపయోగించాడు. చెప్పుతో కొడతా అన్నాడు, తాటతీస్తా అన్నాడు. ఆ పదాలు వాడటం తప్పు. శివాజీ రాజా అనే వ్యక్తి ఏ ట్యాగ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు. నాకు జక్కంపూడి శ్రీను అనే వ్యక్తి, శ్రీధర్ అనే తెలంగాణ వ్యక్తి ఇనిస్టిట్యూట్లో ఫీజులు కట్టాడు. నా ప్రాణ స్నేహితుడు నా కులం కాదే, నేను అతిగా ప్రేమించే అన్నయ్య చిరంజీవి నా కులం కాదే.. నా కులపోడు ఎవరైనా నా పక్కన ఉన్నారా? 2019లో మనం కులం గురించి మాట్లాడుతూ దిగజారిపోతున్నాం.

అన్ని కులాలు కలిసి నిన్ను ఊరి చివరి వరకు తరిమి కొడతాయి

అన్ని కులాలు కలిసి నిన్ను ఊరి చివరి వరకు తరిమి కొడతాయి

‘‘నాగబాబు ఇలాగే మాట్లాడితే అన్ని కులాలు కలిసి నిన్ను ఊరి చివరి వరకు తరిమి కొడతాయి. ప్రజలకు ఏం చేస్తానో చెప్పి ఓటు అడుగు.. నీకు పాత మిత్రుడిగా ఈ విషయం చెబుతున్నాను. నాకు ఇక్కడికి వచ్చినపుడే తెలుసు నన్ను ఎవరూ ఏమీ చేయలేదు. ఇకనైనా నువ్వు మారతావని, నెగెటివ్‌నెస్ పోగొట్టుకుంటావని, పాజిటివ్ నెస్ తెచ్చుకుంటావని కోరుకుంటున్నాను. నేను ఎప్పటికీ మెగా అభిమానినే.'' అంటూ శివాజీ రాజా వ్యాఖ్యానించారు.

ఏ పార్టీకి ఓటు వేయాలనేది నేను చెప్పను

ఏ పార్టీకి ఓటు వేయాలనేది నేను చెప్పను

మరి నాగబాబుకు కాకుండా ఎవరికి ఓటు వేయాలని మీరు చెబుతున్నారు? అనే ప్రశ్నకు శివాజీ రాాజా స్పందిస్తూ... ‘‘తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు, నేను నాగబాబు మంచి వ్యక్తి కాదు అని చెప్పడానికి మాత్రమే వచ్చాను. నాగబాబు లాంటి వారిని కాకుండా మంచి వ్యక్తులను నరసాపురం లోక్ సభ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను.’’ అని శివాజీ రాజా తెలిపారు.

English summary
MAA ex president Actor Sivaji sensational comments on Naga Babu. Do not vote for him, "Shivaji Raja said. Nagababu contesting as MP in Narasapuram.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more