»   » పూరి జగన్నాథ్ సినిమాకు నటి రేవతి దర్శకత్వం?

పూరి జగన్నాథ్ సినిమాకు నటి రేవతి దర్శకత్వం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియాలో ప్రముఖ నటీమణుల్లో రేవతి ఒకరు. త్వరలో ఆమె ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఆ సినిమాను ప్రముఖ తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మించబోతున్నారట. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.

నటిగా రేవతి తమిళం, తెలుగు, మళయాలం, హిందీ, కన్నడలో అనేక చిత్రాల్లో నటించారు. దర్శకురాలిగా ఆమె ఇప్పటి వరకు ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2002లో ఆమె దర్శకత్వంలో వచ్చిన ఇంగ్లిస్ మూవీ 'Mitr, My Friend' సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ ఇంగ్లీష్ విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది.

Revathi to direct a film for Puri ?

తర్వాత ఆమె దర్శకత్వంలో హిందీలో 2004లో ‘ఫిర్ మిలేంగే', 2009లో మళయాలంలో ‘కేరళ కేఫ్', 2010లో హిందీలో ‘ముంబై కట్టింగ్' అనే చిత్రాలు వచ్చాయి. 2011లో రేవతి దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ‘రెడ్ బిల్డింగ్ వేర్ ఈజ్ ది సన్ సెట్'కు జాతీయ అవార్డు దక్కింది.

పూరి జగన్నాథ్ నిర్మాణంలో రేవతి ఎలాంటి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రేవతి దర్శకత్వం అంటే ఆ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. కమర్షియల్ అంశాలకు దూరంగా, సామాజిక అంశాల నేపథ్యంలోనే ఆమె సినిమాలు ఉంటాయి.

English summary
One of the most talented actresses of the south, Revathi is all set to direct yet again. Interesting aspect is that ace director Puri Jagan will produce this project.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu