»   » నైట్ స్పాట్‌లో మాజీ ప్రేమికులు సల్మాన్, కత్రినా

నైట్ స్పాట్‌లో మాజీ ప్రేమికులు సల్మాన్, కత్రినా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ శనివారం రాత్రి ఓ నైట్ స్పాట్‌లో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరు తమ మధ్య బంధాన్ని తెంచుకున్న విషయం తెలిసిందే. అలీ అబ్బాస్ బర్త్ డే పార్టీలో వారిద్దరు కలుసుకున్నారు. అయితే, పుకార్లకు బ్రేక్ వేయడానికి కత్రినా కైఫ్ ఆ భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించింది.

కత్రినా కైఫ్ అధికార ప్రతినిధి పింక్‌విల్లా ఆ వివరాలను వెల్లడించారు. అలీ అబ్బాస్ జాఫర్ కత్రినా సన్నిహిత మిత్రుడని, యేటా ఆయన బర్త్ డే పార్టీకి కత్రినా హాజరవుతుందని, ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా హాజరైందని చెప్పారు.

అలీ అబ్బాస్ సల్మాన్‌తో సుల్తాన్ సినిమాను చేస్తున్నాడని, అందుకే అబ్బాస్ గెస్ట్ లిస్టులో సల్మాన్ ఉన్నాడని, కబీర్ ఖాన్‌తో పాటు చాలా మంది ఉన్న అతిథుల జాబితాలో సల్మాన్ పేరు ఉందని చెప్పారు. కాస్తా గౌరవంగా వ్యవహరించి పుకార్లకు స్థానం కల్పించవద్దని కూడా కోరారు.

REVEALED! The Truth Behind Salman Khan & Katrina Kaif's Late Night Meeting

సల్మాన్ ఖాన్ హాజరైన విందుకు తాను హాజరు కావడంపై కత్రినా కైఫ్ ఎందుకు వివరణ ఇచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. అలీ అబ్బాస్ పార్టీలో వారిద్దరు చాలాసేపు మాట్లాడుకున్నట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరు గంటకుపైగా మాట్లాడుకున్నారని, తొలుత వారితో సంభాషణల్లో పాల్గొన్న అలీ తర్వాత అక్కడి నుంచి పెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి.

వారిద్దరు ఏం మాట్లాడుకున్నారనేది తెలియకపోయినా సల్మాన్‌తో కత్రినా చాలా సాధారణరీతిలో వ్యవహరించిందని వార్తలు వచ్చాయి. అవసరమైతే తనకు సాయం చేయడానికి సల్మాన్ ముందుకు వస్తాడని కత్రినాకు తెలుసునంటూ వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సల్మాన్ తెల్లవారు జామున ఒంటి గంటకు రాగా, కత్రినా రెండు గంటలకు వెళ్లిపోయిందని, సల్మాన్ వేకువ జాము వరకు ఉండిపోయాడని పుకార్లు షికార్లు చేశాయి.

English summary
We all know that Katrina Kaif and Ranbir Kapoor have ended their relationship.After her break up with Ranbir, Katrina was spotted bonding with ex boyfriend Salman Khan on Saturday night at Ali Abbas Zafar's birthday party. Recently, Katrina issued a statement about this meeting to clear things.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu