twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ సైరాకు బిగ్ షాక్, ప్రభుత్వం కఠిన చర్యలు.. రంగస్థలం నేలమట్టం, ఎక్కడికి వెళ్ళాలి!

    |

    Recommended Video

    Revenue Department Shocks Sye Raa Movie Team

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ చిత్రం సైరా నరసింహారెడ్డి. గతంలో స్వాతంత్ర ఉద్యమం నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయి. కానీ వాటన్నింటికి భిన్నంగా సైరా చిత్రం తెరకెక్కుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రం 200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. సైరా చిత్రంఅపి క్రమంగా అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇటీవలే చిత్ర యూనిట్ 35 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. తాజగా ప్రభుత్వం నుంచి సైరా చిత్రానికి చిక్కులు మొదలయ్యాయి.

     చిట్టిబాబు అడ్డాలోనే

    చిట్టిబాబు అడ్డాలోనే

    రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం తెలుగు చలన చిత్ర చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. రాంచరణ్, సమంత, జగపతి బాబు వంటి నటుల అద్భుత నటన, సుకుమార్ తెరకెక్కించిన విధానం విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రంగస్థలం విలేజ్ సెట్ ప్రధాన ఆకర్షణగా మారింది. అదే సెట్ లో సైరా చిత్ర షూటింగ్ కూడా నిర్వహించనున్నారు.

    రెవెన్యూ అధికారుల అడ్డుకట్ట

    రెవెన్యూ అధికారుల అడ్డుకట్ట

    కానీ సైరా చిత్ర యూనిట్ కు రెవెన్యూ శాఖ అడ్డుగా నిలుస్తోంది. రంగస్థలం చిత్ర సెట్ వేసిన భూమి వివాదంలో ఉండడమే దీనికి కారణం. అప్పట్లో రంగస్థలం చిత్ర నిర్మాతలు ఓ నవాబు వద్ద ఈ భూమిని లీజికి తీసుకుని సెట్ నిర్మించుకున్నారు.

     ప్రభుత్వ భూమి అంటూ

    ప్రభుత్వ భూమి అంటూ

    ఇది ప్రభుత్వానికి చెందిన భూమి అని రెవెన్యూ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబందించిన నోటీసులు రంగస్థలం చిత్ర సమయంలో వచ్చాయి. కానీ అప్పుడు చిత్ర యూనిట్ స్పందించలేదు. ఈ భూమి హైదరాబాద్ లో ఉంది.

     రంగస్థలం నేలమట్టం

    రంగస్థలం నేలమట్టం

    సైరా చిత్రం కోసం ఈ సెట్ లో మార్పులు చేస్తూ నిర్మాణాలు చేపడుతుండడంతో రెవెన్యూ అధికారులు కాస్త కఠినంగా వ్యవహరించారు. రంగస్థలం సెట్ వర్క్ ని నేలమట్టం చేసి ప్రభుత్వానికి సంబందించిన ఆదేశాలతో బోర్డు కూడా పాతేశారు.

    సినిమాకు ఉచితంగానే

    సినిమాకు ఉచితంగానే

    సినిమా షూటింగులకు ప్రభుత్వ భూమిని ఉచితంగా వాడుకోవచ్చు. కానీ అనుమతులు తీసుకోవాలి అని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ప్రభుత్వానికి సంబందించిన భూమికి ప్రైవేట్ వ్యక్తులని సంప్రదించడం వారి వద్ద నుంచి లీజుకు తీసుకోవడం నేరం అవుతుందని అంటున్నారు.

    ఏం చేస్తారో

    ఏం చేస్తారో

    సైరా చిత్ర షూటింగ్ ఇంకా చాలా మిగిలివుంది. అధికారుల కఠిన చర్యల నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. తాము మాత్రం ఈ భూమి తనదే అని చెబుతున్న వ్యక్తి నుంచి లీజుకు తీసుకున్నాం అని సైరా చిత్ర యూనిట్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళా ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోతే వేరే ప్రాంతంలో షూటింగ్ చేసుకోవలసి ఉంటుంది.

    English summary
    Revenue department shocks Sye Raa Movie. Revenue department collapse the set
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X