twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రివైజింగ్ కమిటితో బెల్లంకొండ ‘బస్ స్టాప్’కు ఊరట

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ రోజుల్లో పేమ్ మారుతి తాజా చిత్రం 'బస్ స్టాప్'(లవర్స్ అడ్డా) కి సెన్సార్ సమస్యలు ఎదురయ్యిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 40 కట్స్ చెప్పిటంతో రివైజింగ్ కమిటీకి వెళ్ళారు. రివైజింగ్ కమిటీ ఈ చిత్రానికి కేవలం ఐదు కట్స్ తో ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. చిత్రంలో డబుల్ మీనింగ్ డైలాగులు కి ఈ కత్తెర పడనుందని అంతా భావించారు. అయితే రివైజింగ్ కమిటీలో తేలిగ్గా పాసవటంతో దర్శక,నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. మారుతి గత చిత్రం ఈ రోజుల్లో కి ద్వంద్వార్దాలు ఉన్నట్లు విపరీతంగా విమర్శలు వచ్చాయి. కానీ అప్పట్లో సెన్సార్ వద్ద సినిమాకు సమస్య ఎదురుకాలేదు. దేనికైనా రెడీ, కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాల ఎఫెక్టుతో సెన్సార్ తన కత్తెర పదును బాగా పెంచింది. ఈ నేపధ్యంలో ఈ సమస్య ఎదురైంది.

    ప్రిన్స్, శ్రీదివ్య జంటగా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మిస్తున్న చిత్రం 'బస్ స్టాప్'(లవర్స్ అడ్డా). ''ప్రేమకథలన్నీ ఎక్కువ శాతం బస్‌స్టాప్‌లోనే మొదలవుతాయి. అందులో కొన్ని సఫలం అవుతాయి. కొన్ని విఫలమవుతాయి. మరి ఈ సినిమాలో చూపించే ప్రేమకథకు ముగింపు ఏంటో తెరపై చూడాల్సిందే. నా జీవితంలో చూసిన కొన్ని సంఘటలనతో ఈ కథ తయారు చేశాను. నిజానికి దగ్గరగా ఉండే సినిమా ఇది'' అని మారుతి అంటున్నారు.

    నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ''పిల్లలను విచ్చలవిడిగా వదిలేస్తున్న తల్లిదండ్రులకు హెచ్చరికగా నిర్మించిన ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో నిర్మితమైందని, కొత్త వాళ్లైనా అందరూ బాగా నటించారు. ఇది మారుతి బస్‌ స్టాప్‌. దర్శకుడిని నమ్మి సినిమా నిర్మించా. తొలిసారి కథ వినకుండా ఓకె చెప్పాను. మారుతిపెై నమ్మకంతోనే ఇదంతా. కొత్త, పాతతరం నటుల కలయికతో ఆద్యంతం వినోదాత్మకంగా సినిమాని మలిచాడు. 'ఈరోజుల్లో' సినిమాకి కుదరకపోయినా.. ఈ చిత్రంతో మేం కలిశాం. ప్రభాకర్‌ కెమెరా పనితనం, సీజీ ఎఫెక్ట్‌‌స అదనపు అస్సెట్స్‌. ట్రైలర్‌ అద్భుతంగా ఉంది'' అన్నారు.

    ఈ చిత్రానికి కెమెరా: జె.ప్రభాకర్‌రెడ్డి, సంగీతం: జె.బి, ఎడిటింగ్‌: ఉద్దవ్‌, కళ: గోవింద్‌, డాన్స్‌: రఘు,సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: జి.శ్రీనివాసరావ్‌, సహనిర్మాత: బి.మహేంద్రబాబు, రచన-దర్శకత్వం: మారుతి.

    English summary
    Bellamkonda Suresh's‘Bus Stop’ film was submitted for censor certification sometime back and approximately 40 cuts were recommended by the board. Outraged with this decision, the production team decided to escalate the matter and a review was carried out by a Revising Committee. The decision taken after this screening is to recommend 5 small cuts and the movie has now been passed with an A rating.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X