twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో ప్రజాయుద్ధ నౌక.. తన పాత్ర ఏంటో రివీల్ చేసేసిన గద్దర్

    |

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో స్టార్ అట్రాక్షన్ అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్, నయనతార వంటి కీలక నటీనటులు నటిస్తూ ఉండగా సినిమాలో మరింత మంది సెలబ్రిటీలు భాగం అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కమ్యూనిస్టు నేత, మాజీ నక్సలైట్ ప్రజా యుద్ధనౌక గా పిలవబడే గద్దర్ కూడా నటించినట్లు తెలుస్తోంది. తన పాత్ర ఏమిటి? తాను సినిమాలో ఎందుకు నటించాల్సి వచ్చింది అనే విషయాన్ని తాజాగా ఆయన పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    సెట్స్ లో ఉండగానే

    సెట్స్ లో ఉండగానే

    ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేశారు. ఎప్పుడో షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా త్వరలోనే విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఒప్పుకున్నారు.

     మోహన్ రాజా

    మోహన్ రాజా


    అందులో గాడ్ ఫాదర్ సినిమా మీద రకరకాల వార్తలు ప్రతిరోజూ పుట్టుకొస్తూనే ఉన్నాయి. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన లూసిఫర్ అనే సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. తెలుగులో హనుమాన్ జంక్షన్ లాంటి సూపర్ హిట్ సినిమాని అందించిన మోహన్ రాజా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి సినిమా మీద భీభత్సమైన అంచనాలు నెలకొని ఉన్నాయి.

    సల్మాన్ ఖాన్ తో

    సల్మాన్ ఖాన్ తో

    ఈ సినిమాలో తాజాగా సల్మాన్ ఖాన్ కూడా భాగం అవుతున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ ముంబైలో సల్మాన్ ఖాన్ తో చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఈ సినిమాలో తాను కూడా నటించిన విషయాన్ని గద్దర్ వెల్లడించారు. ఒక ప్రముఖ మీడియా సంస్థ తో ఆయన మాట్లాడుతూ తన ఏ పాత్రలో నటిస్తున్నాను అనే విషయాన్ని కూడా వెల్లడించారు.

     కొన్ని సీన్లే అయినా

    కొన్ని సీన్లే అయినా


    ఈ సినిమాలో కథ రీత్యా మెగాస్టార్ చిరంజీవి జైలుకు వెళతారని, జైలులో తనకు చిరంజీవికి మధ్య కొన్ని సీన్స్ చిత్రీకరించారని ఆయన వెల్లడించారు. చిరంజీవి తండ్రికి స్నేహితుడి పాత్రలో తాను కనిపిస్తానని ఆయన వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని కొన్ని సీన్లే అయినా మంచి పారితోషికం కూడా ఇచ్చారని గద్దర్ వెల్లడించారు.

     నిజ జీవిత పాత్రలో

    నిజ జీవిత పాత్రలో


    ఒకరకంగా తాను నిజ జీవిత పాత్రలో నటించానని విప్లవ చైతన్య గీతాల కళాకారుడుగానే ఈ సినిమాలో కూడా కనిపిస్తా అని చెప్పుకొచ్చారు. నిజానికి ఈ పాత్ర మాతృకలో కూడా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్లిన మోహన్ లాల్ తన తండ్రి చిన్ననాటి స్నేహితుడితో మాట కలుపుతారు. అదే పాత్ర కోసం తెలుగులో గద్దర్ ని ఎంచుకున్నారు సినీ దర్శకుడు. ఈ సినిమాలో అనసూయ కూడా కీలక పాత్ర పోషిస్తుందని ప్రచారం జరుగుతోంది దీని మీద మాత్రం అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు.

    English summary
    Revolutionary Gaddar's cameo in Chiranjeevi's Godfather confirmed
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X