twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్‌లో ల్యాండైన ‘మెగా’ మేనల్లుడు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి 'రేయ్' అనే చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలల యూఎస్ షెడ్యూల్ అనంతరం ఈ చిత్రం యూనిట్ హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. ఈ మూడు నెలల కాలంలో న్యూయార్క్, సాన్ ఫ్రాన్సిస్కో, లాస్ వెగాస్‌లతో పాటు ట్రినిడాడ్-టొబాగోలలో చిత్రీకరణ జరిపారు.

    ప్రస్తుతం 'రేయ్' చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్రం ద్వారా సయామీ ఖేర్ అనే భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. అదే విధంగా హీరోయిన్ శ్రద్ధాదాస్ ఈ చిత్రంలో పర్మినెంట్ రోల్ పోషిస్తోంది.
    వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి చక్రి సంగీతం అందిస్తుండగా, గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. 2013లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

    ఈ సినిమా ప్రారంభమై దాదాపు 2 సంవత్సరాలు గడిచి పోయింది. ఆ మధ్య ఆర్థిక సమస్యలతో వైవిఎస్ చౌదరి ఈచిత్రాన్ని కొంతకాలం పక్కన పెట్టారు. కొన్ని నెలల క్రితం మళ్లీ షూటింగ్ ప్రారంభించి ఏకధాటిగా జరుపుతున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి కానుంది.

    మెగా కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోంలా సక్సెస్ అయ్యారు. ఎవ్వరూ వెనకకు తిరిగి చూసుకోకుండా టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు. ఈనేపథ్యంలో సాయి ధరమ్ తేజ ఎంట్రీని కూడా మెగా కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సినిమా పూర్తయిన తర్వాత జరిగే ప్రమోషన్లో మెగా హీరోలు పాల్గొని 'రేయ్' చిత్రంపై అంచనాలు పెంచేందుకు కృషి చేయనున్నట్లు తెలుస్తోంది.

    English summary
    The entire team of YVS Chowdhary's upcoming film Rey has returned from US after almost three months. A major part of the film has been canned in this marathon schedule and the film was shot in New York, San Fransisco, Las Vegas and Trinidad & Tobago in the recent schedule. Currently, the film is being shot in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X