»   »  ‘రేయ్’ పవనిజం సాంగ్ వేడుక (ఫోటోస్)

‘రేయ్’ పవనిజం సాంగ్ వేడుక (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ హీరోగా వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రేయ్'. సయామీ ఖేర్, శ్రద్దాదాస్ హీరోయిన్లు. ఈ చిత్రంపై రూపొందించిన పవనిజం సాంగును, ఆడియోను మంగళవారం విడుదల చేసారు. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి సాంగ్ ఆవిష్కరించారు. తొలి కాపీని ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కు అందజేసారు.

ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ...‘పెద మావయ్య(చిరంజీవి) ఎంతో కష్టపడి పరిశ్రమలో ఒక మహావృక్షంలా ఎదిగాడు. తనకు తానుగా పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. మహావృక్షం నీడలో ఇంకే చెట్టూ ఎదగదంటారు. కానీ ఆయన ఆశీస్సులతో పరిశ్రమలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు తనకంటూ ప్రత్యేక స్టైల్ తో పరిశ్రమలో నిలబడ్డారు. చక్రి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చంద్రబోస్ గారు కళ్యాణ్ గారిని అబ్జర్వ్ చేసి పాట రాసారు. పవనిజం అనేది మేం సృష్టించింద కాదు. జనంలో నుండి వచ్చింది' అన్నాడు.


ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ...సాయి ధరమ్ తేజ్ ని చూసినపుడు ఖైదీలో చిరంజీవిని చూసినట్లు అనిపించింది. చిరంజీవి 30 ఏళ్లుగా తన హవా కొనసాగించారు. ఇంకా కొనసాగుతోంది. పరిశ్రమలోకి ఒంటరిగా వచ్చి మర్రి వృక్షంలా ఎదిగారు. ఆయన ఆశీస్సులతో వచ్చిన పవన్ మద్ది చెట్టులా ఎదిగాడు. అర్జున్, చరణ్ సాలవృక్షాల్లా ఎదిగారు. ఇపుడు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేఝ్ రావి చెట్టుల్లా ఎదుగుతున్నారు. ఈ క్రెడిట్ అంతా చిరంజీవిదే. రజనీలోని అట్రాక్షన్, చిరంజీవిలోని చరిష్మా కలిగిన వ్యక్తి వన్. ఆయన సీఎం ఎప్పుడవుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు' అన్నారు.


పవన్ పర్మిషన్ తీసుకోలేదు

పవన్ పర్మిషన్ తీసుకోలేదు

ఈ పాట చేయడానికి పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ తీసుకోలేదు. నాకు ఆయన గురువు. అలాంటి ఆయన కోసం ఈ పాట చేయడం ఆనందంగా అనిపించింది. చిరంజీవి గారి కోసం ఆల్రెడీ గోలీమార్ పాట చేసామని తెలిపారు సాయి ధరమ్ తేజ్.


సాయి ధరమ్ తేజ్ పాత్ర

సాయి ధరమ్ తేజ్ పాత్ర


జమైకాలోని ఇండియన్ అరిజన్ బ్యాక్ డ్రాపులో కథ తయారు చేసుకుని, దాన్నుండి నా పాత్రను డిజైన్ చేసారు వైవిఎస్. చాలా ఓపెన్ గా ఉండే పాత్ర ఇది. కొన్ని బాడీ లాంగ్వేజస్ స్పెషల్ గా ఉంటాయి. వాటిని ఎలా చేయాలో కూడా వైవీఎస్ గారు చెప్పారు. సినిమా షూటింగులో బాగా అల్లరి చేసాం. సయామీని మేగీ నూడుల్స్ అని పిలిచి ఆట పట్టించే వాళ్లం. వైవిఎస్ గారు దమ్మున్న దర్శక నిర్మాత. ఈ సినిమా కోసం నాలుగేళ్లు కష్టపడ్డారు. ఆ విధంగా కష్టపడటం ఒక్క వైవిఎస్ గారికే సాధ్యమైందని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.


సయామీ ఖేర్

సయామీ ఖేర్


మాట్లాతూ పవన్ కళ్యాణ్ గౌరవార్థం ఈ పాటను చేసినట్లు తెలిపారు. పవనిజం పాట ఆయన అభిమానులతో పాటు అందరూ ఎంజాయ్ చేస్తారు అన్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు ఫోటోలు...


వైవిఎస్ మాట్లాడుతూ..

వైవిఎస్ మాట్లాడుతూ..


సినిమా మొదటి సగం వెస్టిండీస్ లో, సెకండాప్ యూఎస్ లో చేసాను. వరల్డ్ ఆఫ్ ద బెస్ట్ డాన్సింగ్ టైటిల్ కోసం వెస్టిండీస్ కి వెళ్లిన ఓ టీమ్ కథే ఇది అని చెప్పుకొచ్చారు.


పవన్ రాజకీయాల్లోకి రాక ముందే..

పవన్ రాజకీయాల్లోకి రాక ముందే..


పవనిజం సాంగు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాక ముందే చేసాం. ఈ పాట ఎనర్జిటిక్ టానిక్ లా అవుతుంది. ఈ పాట ఆయన అభిమానుల కోసం సినిమాలో యాడ్ చేసామని వైవిఎస్ తెలిపారు.


పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన మాట కోసం

పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన మాట కోసం


పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దామని చాలా ప్రయత్నాలు జరిగినా వీలు కాలేదు. సాయి కోసం పవన్ గారిని కలిసి 20 నిమిషాలు కథ చెప్పాను. విని ఓకే చేసారాయన. కథలో చాలా రిస్క్ ఉంది...చేయగలవా? అని అప్పుడే అడిగారు. తప్పకుండా చేస్తానన్నాను. ఆయనకిచ్చిన మాట దాటకూడదని ఎన్ని పరిస్థితులు వచ్చినా తగ్గకుండా ముందుకెళ్లాను అన్నారు వైవిఎస్.


కథతో పాటు సంగీతానికి ప్రధాన్యత

కథతో పాటు సంగీతానికి ప్రధాన్యత


నా సినిమాలో కథతో పాటు సంగీతానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. చక్రి మంచి సంగీతాన్నిచ్చారు. పవనిజం పాటను 19న షూట్ చేస్తాం. రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసి సినిమాలో యాడ్ చేస్తామని వైవిఎస్ తెలిపారు.


విడుదల

విడుదల


‘రేయ్' చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


English summary
Rey Pawanism Audio Launch event held at Hyderabad. Saiyami Kher and others graced the event.
Please Wait while comments are loading...