»   » ‘రేయ్‌’ : ‘పవనిజం’ సాంగ్ ట్రైలర్ (వీడియో)

‘రేయ్‌’ : ‘పవనిజం’ సాంగ్ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా బొమ్మరిల్లు వారి పతాకంపై స్వీయ దర్శకత్వంలో వైవీఎస్‌ చౌదరి నిర్మిస్తున్న చిత్రం ‘రేయ్‌'. సయామీ ఖేర్‌, శ్రద్ధాదాస్‌ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఆడియోలో పవన్‌కల్యాణ్‌పై రచించిన ‘పవనిజం' అనే ప్రత్యేక పాటను జోడిస్తున్నారు. ఈ పాటను ఈ రోజున విడుదల చేయబోతున్నట్లు వైవీఎస్‌ చౌదరి చెప్పారు. ఈ పాట ట్రైలర్ ని విడుదల చేసారు.మీరు వాట వచ్చేలోగ ఈ ట్రైలర్ ని చూడండి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


‘‘పవన్‌కల్యాణ్‌ సినిమా ఇండస్ట్రీకి చిరంజీవిగారి తమ్ముడిగా పరిచయమైనప్పటికీ, తన సొంత వ్యక్తిత్వంతో, స్వశక్తితో తనవైన మేనరిజమ్స్‌తో, సబ్జెక్ట్‌ సెలక్షన్స్‌తో, తనకే ప్రత్యేకమైన సాంగ్స్‌ స్టయిల్‌తో, తనదైన బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అత్యద్భుతమైన స్టార్‌డమ్‌ తెచ్చుకుని పవర్‌స్టార్‌గా ఎదిగారు. ఆయన అభిమానులకు ఓ ఎనర్జీ టానిక్‌లాగా ‘పవనిజం' పాటను విడుదల చేయబోతున్నాం. ఈ పాటకు స్వర్గీయ చక్రి బాణీలిచ్చారు. చంద్రబోస్‌ రాసిన ఈ పాటకు నోయల్‌ షాన్‌ రాప్‌ రాసుకుని, ఆ రాప్‌ని ఆయనే పాడాడు. ప్రధాన పాటను నరేంద్ర పాడారు'' అని ఆయన వివరించారు.


సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ఓ డాన్సర్ లా కనిపిస్తాడు. డాన్సర్ గా అదిరిపోయే స్టెప్స్ వేశాడని సమాచారం. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేసేలా ఈ సినిమాలో అదిరిపోయే స్టెప్స్ తో మెగా అభిమానులకు పెద్ద ట్రీట్ ఇవ్వనున్నాడని ఈ సినిమా చూసిన కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా చివరి సాంగ్ లో సూపర్బ్ స్టెప్స్ తో ఆకట్టుకుంటాడని సమాచారం. సాయి ధరమ్ తేజ్ సరసన సయామీ ఖేర్, శ్రద్ధ దాస్ హీరోయిన్స్ గా నటించారు. వైవిఎస్ చౌదరి నిర్మించిన ఈ సినిమాని ఎక్కువ భాగం కరేబియన్ దీవులు, కాలిఫోర్నియాలో షూట్ చేసారు. స్వర్గీయ చక్రి సంగీతం అందించాడు.


Rey's Pawanism Song Trailer

వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ ''వెస్టిండీస్‌లో సెటిల్‌ అయిన ఓ కుటుంబానికి చెందిన యువకుడి కథ ఇది. అమెరికాలో జరిగే ఓ సంగీత పోటీ టైటిల్‌ పోరు నేపథ్యంలో చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఎక్కువ భాగం వెస్టిండీస్‌, అమెరికాలోనే చిత్రీకరించాం. అందుకే ఆ ప్రాంతాల్లో సినిమా ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నాం. వెస్టిండీస్‌లో విడుదల కాబోయే తొలి తెలుగు సినిమా ఇది. '' అని తెలిపారు. ఈ చిత్రాన్ని వెస్టిండీస్ లో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు. ఈ విషయాన్ని వైవియస్ చౌదరి మీడియాకు తెలియచేసారు.


అలాగే...''ఈ సినిమాకి చాలా సమయం పట్టింది. దానికి కారణం... ఈ సినిమాలోని విషయం అలాంటిది. సినిమా చూస్తే ఇంతకాలం ఎందుకు పట్టిందో మీకే అర్థం అవుతుంది'' అన్నారు.చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.

English summary
The trailer of much-awaited 'Pawanism' song from 'Rey' has been unveiled a short while ago.
Please Wait while comments are loading...