»   » వర్మ..ముంబై లో చేస్తున్నది ఇదే! ఏమౌతుందో

వర్మ..ముంబై లో చేస్తున్నది ఇదే! ఏమౌతుందో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: విజయవాడ బ్యాక్ డ్రాల్ లో వంగవీటి మోహన్ రంగా జీవిత చరిత్రను తెరకెక్కిస్తానంటూ ప్రకటించిన వర్మ ఇప్పుడు మరో కాంట్రవర్శి సినిమాని టైటిల్ తో సహా ప్రకటించేసారు. దాంతో ఆయన ముంబై వెళ్లి చేస్తున్న లేదా చేయబోతున్న సినిమాపై ఓ క్లారిటి వచ్చినట్లైంది.

వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా కన్నడంలో ఇటీవల తెరకెక్కించిన ‘కిల్లింగ్‌ వీరప్పన్‌'హిట్ తో వర్మ మళ్లీ ఫామ్ లో కి వచ్చారు. ఆ ఊపులో అదే తరహాలో.. దావుద్‌ ఇబ్రహీం, ఛోటా రాజన్‌ల జీవితంపై ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ సాక్షిగా తెలిపారు.

RGV Announces New Film Based On Dawood-Rajan Rivalry!

అలాగే ఈ చిత్రానికి ‘గవర్నమెంట్‌' అనే టైటిల్ కూడా ప్రకటించేసారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘గవర్నమెంట్‌' చిత్రం వాస్తవాలకు చాలా దగ్గరగా ఉంటుందని చెప్పారు. వీరప్పన్ అంటే బ్రతికి లేడు కాబట్టి..వాస్తవాలను చూపినా లేక చూపానంటూ ఏమి చూపినా సమస్య రాలేదు. అదే ప్రపంచాన్ని వణికించే మాఫియా డాన్ ..దావూద్ జీవితంపై వాస్తవాలతో కథ అల్లి తీస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అంటున్నారు.

‘కిల్లింగ్‌ వీరప్పన్‌'లో వీరప్పన్‌ పాత్రను ఎలా చూపించారో.. ఇందులోనూ.. దావుద్‌, ఛోటా రాజన్‌, అబు సలీం, ఛోటా షకీల్‌ తదితరులను అదే విధంగా వాస్తవికతకు దగ్గరగా చూపించబోతున్నట్లు చెప్పారు.

RGV Announces New Film Based On Dawood-Rajan Rivalry!

అంతేకాదు. అమితాబ్‌బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌లు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన సర్కార్‌, సర్కార్‌-2 చిత్రాలకు ఇది సీక్వెల్‌ కాదని వర్మ వివరణ ఇచ్చారు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్తుందని నటీనటుల వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.

నిజానికి 2002లోనే వీరిద్దరి జీవితాన్ని ప్రేరణగా తీసుకుని ‘కంపెనీ' అనే చిత్రాన్ని రూపొందించారు. ఇందులో అజయ్‌ దేవగణ్‌, వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రధారులు. అయితే అందులో వీరిద్దరూ శత్రువులుగా మారడానికి కారణాలు చాలా వరకు కల్పితం. ఇప్పుడు నిజ జీవిత కథ అంటున్నారు.

English summary
Ram Gopal Varma, has thrilled fans by announcing that he's all set to direct a new film titled, Government. The movie, would showcase the rivalry that existed between Dawood Ibrahim and Chotta Rajan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu