»   » అప్పలరాజు (సునీల్) సినిమా తీయటం ఎంతదాకా వచ్చింది?

అప్పలరాజు (సునీల్) సినిమా తీయటం ఎంతదాకా వచ్చింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కథ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం: అప్పలరాజు అని వేయించుకోవటానికి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో వాలిన అప్పలరాజు కథని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ నిన్నటి(సోమవారం) నుంచి హైదరాబాద్ గోల్కొండ టూంబ్స్ లో జరుగుతోంది. ఈ సందర్బంగా నిర్మాత కోనేరు కిరణ్ కుమార్...ఈ చిత్రం విశేషాలను మీడియాకు వివరించారు. ఆయన మాటల్లోనే..అమలాపురం అప్పల్రాజుకి సినిమాయే లోకం. విడుదలైన ప్రతి సినిమా చూడాల్సిందే. అందులోని కథనీ, హీరోల యాక్షన్నీ, డైరక్టర్లు తీసిన విధానాన్నీ చీల్చి చెండాడాల్సిందే. ఆ దర్శకుల కంటే తనెంత బాగా తీసేవాణ్నో కనబడ్డ ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిందే.

ఇక తన మీద తనకు నమ్మకం పెరిగిపోయాక హైదరాబాద్‌ వచ్చేసి ఫిల్మ్‌నగర్లో వాలిపోయాడు అప్పల్రాజు. ఆ తరవాత అతని సినిమా కల ఏ విధంగా నెరవేరిందో వెండి తెరపై చూడాల్సిందే అన్నారు. అలాగే ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రమిది. వర్మ కథను తీర్చిదిద్దిన విధానం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అప్పల్రాజు పాత్రలో సునీల్‌ ఒదిగిపోయారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్‌, కృష్ణుడు, వేణుమాధవ్‌, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్‌ వర్మ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu