»   » బండ్లగణేష్ ని మూతులు నాకే కుక్క తో పోలుస్తూ.... వర్మ కౌంటర్ అటాక్

బండ్లగణేష్ ని మూతులు నాకే కుక్క తో పోలుస్తూ.... వర్మ కౌంటర్ అటాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కాటమరాయుడు' సినిమాపై.. పవన్ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై నిన్న రామ్ గోపాల్ వర్మ చేసిన వివాదస్పద ట్వీట్లకు.. పవన్ కల్యాణ్ వీరాభిమాని, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చిత్రం విడుదల సందర్భంగా వర్మ ట్వీట్స్ చేస్తూ... పవన్ మూడు పెళ్లిల్ల గురించి, కూతుళ్ల గురించి కూడా ప్రస్తావించి వ్యక్తిగత విమర్శలు చేశాడు. దీంతో పవన్‌ భక్తుడు బండ్ల గణేష్‌ కూడా వర్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మాములుగా కాకుండా, రాంగోపాల్ వర్మ ట్వీట్లకు అంతే ఘాటుగా.. హాట్‌గా సమాధానమిచ్చాడు బండ్ల.

పవన్‌ కల్యాణ్‌ చెప్పుకున్న విలువ కూడా లేదు

పవన్‌ కల్యాణ్‌ చెప్పుకున్న విలువ కూడా లేదు

మిస్టర్‌ రాము, పవన్‌కల్యాణ్‌ను విమర్శించే ముందు నీ నోటిని అదుపులో పెట్టుకో. నీకు పవన్‌ కల్యాణ్‌ చెప్పుకున్న విలువ కూడా లేదు' అని ట్వీట్‌ చేశాడు. నువ్వు వీధిలో మొరిగే కుక్కలాంటోడివి.. ఎక్స్‌పైరీ అయిపోయిన టాబ్లెట్ లాంటోడివి.. అసలు నిన్ను భారతీయుడు అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. నువ్వు టెర్రరిస్ట్‌కు ఏమాత్రం తక్కువ కాదు.. నీ తీరు మార్చుకోకపోతే బుద్ధి చెబుతాం' అంటూ రాంగోపాల్ వర్మకు నిన్న బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా ఫుల్ కోటింగ్ ఇచ్చాడు.

బండ్ల గణేష్

బండ్ల గణేష్

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌పై అతడి వ్యక్తిగత జీవితంపై తాను చేస్తున్న అప్రతిహత దండయాత్రకు ఆటంకం కలిగిస్తూ పానకంలా పుడకలో వచ్చి తనపైన రెచ్చిపోతున్న బండ్ల గణేష్ కు రాంగోపాల్ వర్మ కచ్చితంగా ఘాటు సమాధానమిస్తాడని అంతా ఎదురు చూసారు అయితే ఎవరూ ఉహించని విధంగా అప్పటికి సైలెంట్ అయిపోయాడు వర్మ... అక్కడితో ఇక ముగుసి పోయిందనే అనుకున్నారంతా... కానీ అలా ఆగిపోతే వర్మ రామ్ గోపాల్ వర్మ ఎందుకవుతాడు...

వర్మ ఓ వీధి కుక్క అని

వర్మ ఓ వీధి కుక్క అని

ఈ ట్వీట్స్‌పై చెలరేగిన వివాదం అంతాఇంతా కాదు. నిర్మాత బండ్ల గణేష్ అయితే ఒకడుగు ముందుకేసి వర్మపై ట్వీట్ల రూపంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. రాంగోపాల్ వర్మ ఓ మొరిగే కుక్క అంటూ ఘాటుగా స్పందించాడు. పవన్ చెప్పుకున్న విలువ కూడా వర్మకు లేదని ట్వీట్ చేశాడు. వర్మ ఓ వీధి కుక్క అని పోస్ట్ చేశాడు.

 కౌంటర్ అటాక్‌

కౌంటర్ అటాక్‌

ఈ ట్వీట్స్‌కు వర్మ తాజాగా కౌంటర్ అటాక్‌కు దిగాడు. మూతులు నాకే కుక్కల కన్నా మొరిగే కుక్కలు చాలా బెటర్ అని వర్మ ట్వీట్ చేశాడు. మొరిగే కుక్కలకు కుక్కల్లా ఎలా కరవాలో తెలుసని, కానీ మూతులు నాకే కుక్కలు ఎలుకల కంటే అధ్వానమని ట్వీట్ చేశాడు. బండ్ల గణేష్‌ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ వర్మ ట్వీట్ చేశాడు.

రామ్‌గోపాల్ వర్మ మరణం

రామ్‌గోపాల్ వర్మ మరణం

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మళ్ళీ ప్రత్యక్షం అవుతున్న "రామ్‌గోపాల్ వర్మ మరణం" ఫేక్ వార్తని పోస్ట్ చేస్తూ లవ్ యు టూ మై డియర్ స్వీట్ డార్లింగ్ లవ్లీ, బ్యూటిఫుల్, క్యూట్ పీకే ఫ్యాన్స్... అంటూ స్మైలీలుకూడా కలిపి పోస్ట్ చేసాడు వర్మ.. ఈ ట్వీట్ల గొడవ ఏదో ముదిరి పాకాన పడుతున్నట్టే ఉంది పవన్ పవన్ లైన్లోకి వస్తే తప్ప ఆగేలా లేదు..

English summary
"Barking dogs far better than licking dogs bcos barking dogs can atleast graduate to biting dogs and licking dogs will become worse than rats" Tweets Varma
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu