»   » రామ్ గోపాల్ వర్మ పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీలు

రామ్ గోపాల్ వర్మ పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
RGV
హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూతురు రేవతి వివాహం ఈ నెల 15న జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ తెలుగు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖుల కోసం పార్టీ ఏర్పాటు చేసి తన కూతురు రేవతి, కాబోయే అల్లు ప్రణవ్‌ను వారికి పరిచయం చేసారు.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ పార్టీకి రామ్ గోపాల్ వర్మకు సన్నిహితులైన రవితేజ, అల్లు అర్జున్, చార్మి, పూరి జగన్నాథ్, జగపతి బాబు, మనోజ్ బాజ్‌పాయ్, మధు శాలిని, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రచయితలు కోన వెంకట్, సిరాశ్రీ, మరికొందరు క్లోజ్ ప్రెండ్స్ హాజరైనట్లు తెలుస్తోంది.

చీకట్టి పడ్డ తర్వాత ప్రారంభమైన ఈ పార్టీ తెల్లవారు ఝామున 4 గంటల వరకు జరిగిందని, అతిథుల కోసం ప్రత్యేకమైన వంటకాలు చేసారని తెలుస్తోంది. పెళ్లి కార్యక్రమం పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా జరుగనున్న నేపథ్యంలో పెళ్లి ముందే వారిని పరిచయం చేసేందుకు వర్మ ఈ పార్టీ ఏర్పాటు చేసారట.

వర్మ కుమార్తె రేవతి వైద్య విద్యను అభ్యసించారు. ప్రణవ్‌ కూడా వైద్య వృత్తిలో ఉన్నారు. వాళ్లిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ప్రణవ్ తల్లి, తండ్రులు దుబాయి‌లో వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. ఆగస్టు 15న హైదరాబాద్ రేవతి-ప్రణవ్ వివాహం జరగనుంది. పెద్దగా ఎవరినీ పిలవకుండా... కేవలం బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరపనున్నారు. వర్మ కూతురు కోరిక మేరకే ఇలా ఏ హడావుడి లేకుండా మీడియాకు దూరంగా ఈ పెళ్లి వేడుక నిర్వహించాలని డిసైడ్ అయ్యారట.

English summary
Ram Gopal Varma's daughter Revathy, will be tying the knot with fiance Pranav on August 15 at a star hotel in Secunderabad. Though RGV has many friends in the Hindi and Telugu film industry, they'll be missing at the nuptials as his daughter insists on having a private wedding ceremony.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu