»   » వర్మ అధ్బుతం చేసాడంటున్న స్టార్ డైరక్టర్

వర్మ అధ్బుతం చేసాడంటున్న స్టార్ డైరక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో స్టార్ డైరక్టర్ స్ధాయిలో వెలిగిన మహేష్ భట్ వర్మను పొగుడుతూ ట్వీట్ చేసారు. వర్మ తాజా చిత్రం నాటే ఎ లవ్ స్టోరీ ప్రివ్యూని చూసిన మహేష్ భట్ తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు.ఆయన ట్వీట్ లో... రామ్ గోపాల్ వర్మ అవుట్ స్టాండింగ్ సినిమా తీసారు. నాటే ఎ లవ్ స్టోరీ సినిమా ఇండియా స్టాండర్డ్స్ ని పెంచుతుంది. అలాగే ఈ చిత్రం కోసం రాము ఓ బ్రాండ్ న్యూ టెక్నాలిజినీ వాడారు.ఇది ఖచ్చితంగా నిర్మాణ విలువలను మారుస్తుంది.ఈ చిత్రం ప్రేక్షకులను ఇంప్రెస్ చేయటం కాకుండా కదిలిస్తుంది. ఈ సినిమా చాలా గొప్ప ప్రేమ కథ అన్నారు.

ఇక ఈ చిత్రాన్ని 'ఇది ప్రేమ కథ కాదు" అనే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్ర కథ ప్రకారం హీరోయిన్ కావలన్న కోరికతో ముంబాయ్ వచ్చిన ఓ అమ్మాయి అప్పటికే ఒక వ్యక్తితో ప్రేమాయణం నడుపుతూ.. సినిమా అవకాశాల కోసం మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. సినిమా అవకాశాల కోసం అక్రమ సంబంధం పెట్టుకున్ వ్యక్తితో కామకలాపాలు సాగిస్తున్న సమయంలో ఆమె బోయ్ ఫ్రెండ్ అక్కడికి అకస్మాత్తుగా చేరుకుని జరుగుతున్నది చూసి చిర్రెత్తిపోతాడు. ఆ సందర్భంగా జరిగిన కొట్లాటలో మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఎవరు చేసారనేది ఇన్వెస్టిగేట్ చేయడం మిగతా కథ. నిజంగా జరిగిన ఓ సంఘటన చుట్టూ అల్లుకున్న కథ ఇదని వర్మ చెబుతున్నాడు.

English summary
Acclaimed filmmaker Mahesh Bhatt describes Ram Gopal Varma as a ‘man who has audacity’, and says he should be given a standing ovation for making an ‘outstanding’ film like ‘Not A Love Story’, which releases on Friday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu