గెస్ట్ హౌస్ లో గన్స్ ...గర్ల్స్ ('దొంగలముఠా' ప్రివ్యూ)
రామ్ గోపాల్ వర్మ ప్రయోగాత్మకంగా రూపొందించిన దొంగలముఠా చిత్రం ఈ రోజు(శుక్రవారం)విడుదల అవుతోంది. ఈ చిత్రంలో కథ ప్రకారం ప్రెండ్ వివాహానికి బయిలుదేరిన సుధీర్ (రవితేజ), రాణి (చార్మి)లు అనుకోకుండా ఓ గెస్ట్‌హౌస్ కి చేరుకుంటారు. ఆ గెస్ట్‌హౌస్‌లోకి అప్పటికే మరి కొంత మంది అపరిచితులు ఉంటారు. దాంతో వారి మధ్య ఊహించని సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటాయి. కొంత కామిడి,మరికొంత ధ్రిల్స్ కలగిపిన ఈ చిత్రంలో ఆ అపరిచితులు ఎవరు...అసలు సుధీర్ ఎవరనేది ట్విస్ట్. ఈ చిత్రం గురించి నిర్మాత కిరణ్ కుమార్ మాట్లాడుతూ...ఈ చిత్రాన్ని కేవలం నాలుగున్నర రోజుల్లోనే చిత్రీకరణ పూర్తిచేశాం. రూ.ఆరున్నర లక్షలే ఖర్చుచేశాం. ఈ సినిమా కోసం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొన్నాం. తెలుగు పరిశ్రమలో ఓ కొత్త పక్రియకు శ్రీకారం చుట్టాం. కథ, కథనాలు కూడా ఆకట్టుకొంటాయి. వర్మ శైలిలోనే విభిన్నంగా సాగే చిత్రమిది అన్నారు.
వర్మ మాట్లాడుతూ...ఈ సినిమాకి ఆరున్నర లక్షలు ఖర్చయింది. ఈ చిత్రం ఒక్క షో ఆడినా అది హిట్టే. వంద రోజులు షూటింగ్ ఎందుకు తీస్తున్నామో అర్థ్ధమైతే ఐదురోజుల్లో ఎలా తీసామో అర్థమవుతుంది. కేనన్ 5 కెమెరాతో ఈ చిత్రాన్ని షూట్ చేసాం. టెక్నికల్‌గా అనేక మార్పులు ఉన్నా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే... ఐదురోజుల్లో ఈ చిత్రాన్ని నిర్మించింది గిన్నిస్ బుక్‌లోకి ఎక్కడానికి కాదు. ఇలాంటి చిత్రాలు టెక్నికల్‌గా చేయాలనీ, తక్కువ టైమ్‌తో చేయవచ్చునని చూపించడానికి చేసాను. మొత్తం ఏడుగురు సభ్యులతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఐదుగురు కెమెరామెన్‌లు, నేను, నా అసిస్టెంట్ తప్ప మరెవరూ లేరు. ప్రతి సీను ఐదు ఏంగిల్స్‌లో తీసాం అన్నారు.
సంస్థ: శ్రేయ ప్రొడక్షన్స్
నటీనటులు: రవితేజ, చార్మి, మంచు లక్ష్మీప్రసన్న, ప్రకాష్‌రాజ్, సుబ్బరాజు, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సుప్రీత్, అజయ్ తదితరులు.
నిర్మాత: కిరణ్ కుమార్ కోనేరు
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ


Click it and Unblock the Notifications











