»   » వర్మ పేరుతో పబ్ లో ...కాకటైల్ ప్రారంభం

వర్మ పేరుతో పబ్ లో ...కాకటైల్ ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ లోని "కాక్టైల్స్ లాంజ్" రెస్టారెంట్ లో "ఆర్జీవీ ఎలిక్జిర్" పేరిట కొత్త కాక్టైల్ నేడు ప్రారంభమయింది. ఈ కాక్ టైల్ ను ప్రతి తెలుగువాడు గర్వించే జాతీయస్థాయి సినీదర్శకులు రాం గోపాల్ వర్మ కి గౌరవసూచికంగా ప్రారంభిస్తున్నట్టు "కాక్టైల్స్ లాంజ్" యాజమాన్యం తెలిపింది. ఇక ఈ కాకటైల్ విషయమై వర్మ ట్వీట్ చేసి తెలిపారు.

ఆ రెస్టారెంట్ అధినేత రామరాజు మాట్లాడుతూ - "సుప్రసిధ్ధ సినీ దర్శకులు, నవతరం స్ఫూర్తిదాయకులు శ్రీ రాం గోపాల్ వర్మ గారి చేతుల మీదుగా ఆయన పేరుతో, సినీ ప్రముఖుల మధ్య ఈ "ఆర్జీవీ ఎలిక్జిర్" అనే కాక్టైల్ మా రెస్టారెంట్ లో ప్రారంభం కావడం మాకు గర్వదాయకం. ఈ కాక్టైల్ కి నామకరణం చేసిన "వోడ్కా విత్ వర్మ" రచయిత సినీ కవి సిరాశ్రీ గారికి, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన కళామందిర్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు" అన్నారు.

ఈ వేడుకలో సినీదర్శకులు కృష్ణ వంశీ, జేడీ చక్రవర్తి, కోనా వెంకట్, బ్రహ్మాజీ, నిఖిల్, సందీప్ కిషన్, నవదీప్, రాజ్ తరుణ్, నందు, బీవీయస్ రవి, పృథ్వీ, సత్యం రాజేష్, సప్తగిరి, రాజా రవీంద్ర, శ్రీనివాస రెడ్డి, లగడపాటి శ్రీధర్, మధుశాలిని, తేజశ్వి, నికిత, స్వాతి, అనితా చౌదరి, డా గజల్ శ్రీనివాస్, సుబ్బరాజు, మధుర శ్రీధర్, రాజ్ కందుకూరి, సిరాశ్రీ, కళామందిర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే.. నానా పటేకర్‌లాంటి చక్కటి నటుడిని తన జీవితంలో ఇంత వరకూ చూడలేదని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. వర్మ దర్శకత్వంలో 2013లో విడుదలైన 'ది ఎటాక్స్‌ ఆఫ్‌ 26/11' చిత్రంలో నానా పటేకర్‌ పోలీసు అధికారిగా నటించారు. ఈ చిత్రంలోని ఒక సన్నివేశంలో ఆయన అద్భుతంగా నటించారంటూ... వర్మ ఓ వీడియో లింక్‌ను అభిమానులతో పంచుకున్నారు.

ఇక వర్మ తాజా చిత్రం ‘కిల్లింగ్‌ వీరప్పన్‌' విషయానికి వస్తే... గందపుచెక్కల దొంగ వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అండర్‌ వరల్డ్‌ డాన్‌, మాఫియా డాన్‌ల కంటే కూడా వీరప్పన్‌ ఎంతో శక్తివంతుడు అని, ఆయన తిరుగులేని క్రిమినల్‌ అంటూ వీరప్పన్‌ గురించి వర్మ చెబుతుూ మరీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ,హిందీ, తెలుగులో ఈ చిత్రం రూపొందుతోంది.

రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కొన్నేళ్ళ పాటు వణికించిన డేంజరస్ క్రిమినల్ వీరప్పన్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథగా ‘కిల్లింగ్ వీరప్పన్' రూపొందుతోంది. కర్ణాటక, తమిళనాడు, మారెడుమిల్లి ఫారెస్ట్ ఏరియాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుందని వర్మ తెలియజేశారు.

English summary
Ram Gopal Varma tweeted: " Out of respect or disrespect "On the Rocks" pub at Jubilee Hills launched a cocktail Rgv Elixir..Humbled and Amused "
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu