»   »  వర్మ మరో సెన్సేషన్: సునంద హత్యపై సినిమా?

వర్మ మరో సెన్సేషన్: సునంద హత్యపై సినిమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంచలనాలకు మారుపేరైన ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ....గతంలో పలు వివాదాస్పద అంశాలను తన సినిమాలకు కథలుగా వాడుకుని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 26/11 ముంబై దాడులపై, పరిటాల రవి హత్యోదంతంపై, అండర్ వరల్డ్ మాఫియాపై ఆయన తీసిన సినిమాలు సెన్సేషన్ సృష్టించాయి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తాజాగా రామ్ గోపాల్ వర్మ..... మరో వివాదాస్పద అంశాన్ని సినిమాగా తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్యోదంతంపై అతను సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె హత్యకు కారణం ఎవరనే విషయం ఇంకా తేలక ముందే సినిమా ప్లాన్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

RGV film on Sunanda

ఆ సంగతి పక్కన పెడితే...రామ్ గోపాల్ వర్మ మరో సినిమాకు రెడీ అయ్యారు. ఈ సారి ఆయన సచిన్ జోషితో సినిమా తీయబోతున్నాడు. తెలుగు-హిందీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలంగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న వర్మ ఇపుడు సచిన్ ద్వారా బాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

కాలంగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న వర్మ ఇపుడు సచిన్ ద్వారా బాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సచిన్ జోషి నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘నీ జతగా నేనుండాలి' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రా బాక్సీఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద పెద్దగా రాబట్టలేక పోయాయి. మరి ఇద్దరూ కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

English summary
It is a well-known fact that Ram Gopal Varma makes his presence felt wherever there is trouble. The latest buzz is that he is now planning to make a film on Sunanda Pushkar, the late wife of politician Shashi Tharoor. The director is said to have been following the case closely and noting down points for a script.
Please Wait while comments are loading...