»   » ఛార్మి ఎఫెక్ట్: పూరికి రామ్ గోపాల్ వర్మ వార్నింగ్?

ఛార్మి ఎఫెక్ట్: పూరికి రామ్ గోపాల్ వర్మ వార్నింగ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు ముందు దర్శకుడు పూరి జగన్నాథ్ యంగ్ హీరో నితిన్ తో ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల చేత ఆ సినిమా రద్దయింది. దీంతో చార్మి జోక్యం వల్లనే ఈ సినిమా రద్దయిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ వార్తలతో హర్టయిన ఛార్మి ఈ వ్యవహారాన్ని పెంట పెంట చేసింది.

అసలు నాకూ, నితిన్ సినిమాకూ సంభంధం ఏమిటి...ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయటానికి నితిన్ వద్ద డబ్బులు లేవు...సో సినిమా ఆగిపోయింది. ఉన్న డబ్బులన్నీ అఖిల్ సినిమాకు పెట్టేయటం వల్లే ఈ సినిమా మొదలు కాలేదు...దానికి నేనెలా భాధ్యురాలిని అని ఛార్మి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే...తాను రూమర్స్ ని నమ్మి ఆ మాటలు అన్నానని సిన్సియర్ గా క్షమాపణ అడుగుతున్నట్లు తెలియచేసింది.

RGV given strict warning to Puri

నితిన్ ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చార్మి చెప్పకనే చెప్పింది. పూరి వల్లనే చార్మికి ఈ విషయాలు తెలిసాయనేది ఫిల్మ్ నగర్ టాక్. ఈ విషయం తెలిసిన రామ్ గోపాల్ వర్మ పూరికి క్లాస్ పీకినట్లు సమాచారం. ఆమెతో ఫ్రెండ్షిప్ చేయ్, కానీ ప్రొడక్షన్ వ్యవహారాలకు ఆమెను దూరంగా ఉంచు అని సలహా ఇచ్చాడట.

సినిమా రంగంలో ఇలాంటి విషయాలు చాలా కీలకం. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా ఔటాఫ్ బిజినెస్ లా ఉండాలి అని రామ్ గోపాల్ వర్మ పూరికి చెప్పినట్లు టాక్. ఆ సంగతి పక్కన పెడితే నితిన్ తో రద్దయిన మూవీని వరుణ్ తేజ్ తో చేయాలని నిర్ణయించుకున్నాడు పూరి జగన్నాథ్.

English summary
Ram Gopal Varma is said to have given strict warning to Puri about involving Charmme in production affairs.
Please Wait while comments are loading...