»   » పిచ్చెక్కి అందరినీ తిడుతున్నాడు : శివాజీ రాజా సంచలనం!

పిచ్చెక్కి అందరినీ తిడుతున్నాడు : శివాజీ రాజా సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా సంచలన కామెంట్స్ చేశారు. వర్మ మానసిక స్థితి బాగోలేదని, అందుకే పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తూ అందరినీ తిడుతున్నాడని కామెంట్ చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శివాజీ రాజా ఈ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ వివాదంలో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రభుత్వానికి రాసిన లేఖ సర్కార్‌కు సరెండర్ అయిపోయినట్లు ఉందని వర్మ విమర్శించడంపై స్పందించాలని శివాజీ రాజాను కోరగా.... ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.

వర్మను ఇద్దరు వైద్యులకు చూపించాలి

వర్మను ఇద్దరు వైద్యులకు చూపించాలి

రామ్ గోపాల్ వర్మ మానిసిక స్థితి బాగోలేదని ఒక్కరు కాదు ఇద్దరు సైక్రియాటిస్టులకు చూపించాలన్నారు. ఆయన సినిమాలు తీయటం మానేసి అందరినీ తిడుతూ, విమర్శిస్తూ బ్రతుకుతున్నాడని శివాజీ రాజా అన్నారు.

ఇదంతా అవసరమా?

ఇదంతా అవసరమా?

వర్మ మంచి డైరెక్టర్ అని, మంచి సినిమాలు తీయకుండా ట్వీట్లతో ఎందుకు టైం వేస్ట్ చేయటం అంటూ శివాజీరాజా ప్రశ్నించారు. అయితే వర్మ అభిమానులు మాత్రం.... వర్మను ఎదుర్కొనే దమ్ములేక శివాజీ రాజా లాంటి వారు అతడిపై పిచ్చోడనే ముద్ర వేస్తున్నారని మండి పడుతున్నారు.

గతంలో వర్మ చేసిన విమర్శ ఇదే...

గతంలో వర్మ చేసిన విమర్శ ఇదే...

డ్రగ్స్ కేసు వ్యవహారంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ వారు ముఖ్యమంత్రికి లేఖ రాయడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫైర్ అయ్యారు. ఇలాంటి లేఖ రాసి పరిశ్రమ పరువు తీశారు అంటూ వర్మ మండి పడ్డారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ సంధించారు. సినీ పరిశ్రమ నిజంగా సిగ్గు పడాల్సిన విషయం డ్రగ్ స్కాండల్ కాదు....ఆ డ్రగ్ స్కాండల్ కి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఒక బహిరంగలేఖతో తెలుగు సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చే విధంగా అవసరం లేని క్షమాపణ చెప్పి ప్రాధేయపడిన విధానం సిగ్గు పడే విషయం...... అంటూ వర్మ తన బహిరంగ లేఖ రాశారు.

ఏం కారణానికి అపాలజీ చెప్పినట్లు?

ఏం కారణానికి అపాలజీ చెప్పినట్లు?

ఫిల్మ్ ఛాంబర్ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే నోటీసులు అందుకుని విచారణకి హాజరైన వారిలో ఏ ఒక్కరూ కూడా తాము తప్పు చేశామని బహిరంగంగా చెప్పడం కానీ, వారిలో ఫలానా వారి తప్పు నిరూపించబడింది అని అధికారులు చెప్పడం గాని ఇంతవరకు జరగలేదు. ఈ రెండూ జరగనప్పుడు ఏ కారణానికి అపాలజీ చెప్పినట్టు?... అని వర్మ ప్రశ్నించారు.

ఆగ్రహించాల్సింది పోయి ఇదేమిటి?

ఆగ్రహించాల్సింది పోయి ఇదేమిటి?

అపాలజీ లెటర్ లో ఒక వాక్యం"అతికొద్దిమంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం"- ఏమిటిది? ఎవరు చెప్పారు మీకు ఎవరు పొరపాట్లు చేసారో? అసలు వాళ్లు చేసిన నేరమేమిటో, దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటో కూడా చెప్పకుండా వాళ్లు అప్పుడే ఏదో మహా నేరం చేసినట్టు కలర్ ఇచ్చిన అధికారులపై ఆగ్రహించాల్సింది పోయి ఆల్రడీ నేరం ఋజువైందనే ధోరణిలో క్షమాపణలేఖ పంపించడంలో అర్థం ఏమిటి?...... అంటూ ఫైర్ అయ్యారు.

ఏ మాత్రం -పౌరుషం ఉన్నా

ఏ మాత్రం -పౌరుషం ఉన్నా

అలాగే నోటీసులు అందుకున్న వారికి నా విన్నపం "మీలో ఏ మాత్రం -పౌరుషం ఉన్నా, మీ పైన వచ్చిన ఆరోపణల మూలాన మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పడిన మానసికవేదనపై మీరు ఏ మాత్రం నైతిక బాధ్యత ఫీల్ అవుతున్నా, జరిగిన ఆరోపణలపై నోరు విప్పి మీరు కూడా బహిరంగ లేఖలు రాయాలి.... అంటూ వర్మ సూచించారు.

ఆ హక్కు ప్రతి పౌరుడికీ ఉంది

ఆ హక్కు ప్రతి పౌరుడికీ ఉంది

విషయం కోర్టులో ఉంటే మాట్లాడకూడదనే ఆలోచన సరైనది కావచ్చేమో కానీ, అసలు చార్జెస్ కూడా ఫైల్ అవ్వని ఇలాంటి సందర్భంలో నిజం మాట్లాడే హక్కు రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికీ వుంది..... అని వర్మ వ్యాఖ్యానించారు.

అంతకు మించిన పిరికితనం మరొకటి ఉండదు

అంతకు మించిన పిరికితనం మరొకటి ఉండదు

ఒకవేళ అలా మాట్లాడడం వల్ల చెయ్యని తప్పులని నిజం చేసి, అన్యాయంగా కేసులు బనాయించి చట్టం చట్రంలో మరింత బలంగా బిగిస్తారేమో అనే భయంతో మాట్లాడలేకపోతే అంతకు మించిన పిరికితనం మరొకటి ఉండదు. అది ప్రజాస్వామ్యానికే అవమానం"..... అంటూ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే

ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే

అలాగే రేపు ఫైనల్ గా ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే ఛాంబర్ కి ఏ మాత్రం విచక్షణ వున్నా అధికారులకి బహిరంగ క్షమాపణలేఖ రాసినట్టే ఆరోపణలు ఎదుర్కున్న వాళ్లందరికీ బహిరంగ లెఖ ద్వారా క్షమాపణ చెప్పాలి...... అని వర్మ పేర్కొన్నారు.

English summary
In an interview given to a TV Channel, MAA President Shivaji Raja said: 'RGV has gone completely mad. He deserves treatment from not just one but two doctors'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu