»   » పగలబడి నవ్విన శ్రీదేవి: వర్మ చివరి ట్వీట్ ఇదే, తీరని జూ ఎన్టీఆర్ కోరిక...

పగలబడి నవ్విన శ్రీదేవి: వర్మ చివరి ట్వీట్ ఇదే, తీరని జూ ఎన్టీఆర్ కోరిక...

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి మరణంతో యావత్ ఇండియన్ సినీ పరిశ్రమ విషాదంలో మునిగి పోయింది. శ్రీదేవిని దేవతలా ఆరాధించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉదయం నుండి ట్వీట్ల మీద ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. వరుస ట్వీట్లతో సోషల్ మీడియాను కంపింపచేసిన వర్మ.... శ్రీదేవి గురించి చివరి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నారు.

శ్రీదేవి మరణంతో బాలీవుడ్ షాక్ : ట్విట్టర్లో ప్రముఖుల సంతాపం!
శ్రీదేవి గురించి ఇదే నా ఆఖరి ట్వీట్

శ్రీదేవి గురించి ఇదే నా ఆఖరి ట్వీట్

'శ్రీదేవి గురించి ఇదే నా ఆఖరి ట్వీట్.. ఇప్పటి నుంచి తను ఇంకా బతికి ఉందనే ఊహించుకుంటాను.' అని ఆర్జీవి వెల్లడించారు.

జీవితాంతం కటీఫ్

‘నేను మిమ్మల్ని ఇంత నవ్వించా.. మీరు ఇప్పుడు నన్నింత ఏడిపించడం అన్యాయం ఇంకెప్పటికీ మీతో మాట్లాడను.. జీవితాంతం కటీఫ్' అని వర్మ ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు.

శ్రీదేవిపై జూ ఎన్టీఆర్ మోజు

శ్రీదేవిపై జూ ఎన్టీఆర్ మోజు

తన తాతయ్య ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాల్లో శ్రీదేవి చేశారు. తాతయ్య సినిమాలు చూస్తూ పెరిగిన జూ ఎన్టీఆర్ శ్రీదేవిపై మోజు పడ్డారు. ఆమె అంటే ఎంతో ఇష్టం, అభిమానం పెంచుకున్నారు. అనేక సందర్భాల్లో తారక్ ఈ విషయం వెల్లడించారు.

శ్రీదేవి అంటే పిచ్చి

శ్రీదేవి అంటే పిచ్చి

గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే‌లో జూ ఎన్టీఆర్ మాట్లాడుతూ శ్రీదేవి అంటే తనకు పిచ్చి అని, ఆమె తన కలల హీరోయిన్ అని తెలిపారు. ఆమెకు సాటి ఇప్పటి వారు ఎవరురారని... చెప్పుకొచ్చారు.

జూ ఎన్టీఆర్ మైండ్‌లో ఆమె ఫిక్స్

జూ ఎన్టీఆర్ మైండ్‌లో ఆమె ఫిక్స్

ఆమె గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఒక మాట, ఒక భార్య, ఒక బాణం అని చెప్పినట్టు సినీ నటి అంటే ఆమె మాత్రమే అనేలా తన మైండ్‌ లో ఫిక్స్‌ అయిపోయిందని.... ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ కోరిక తీరకుండానే...

ఎన్టీఆర్ కోరిక తీరకుండానే...

శ్రీదేవి హీరోయిన్‌‌గా చేయడానికి ఓకే అంటే ఆమెతో కలిసి నటించేందుకు తాను కూడా సిద్ధమని ... అయితే ఆమె తనతో చేయరని, ఏదో ఒక సినిమాలో ట్రై చేసి, ఆమెను కనీసం ఒక్క పాటలో అయినా తనతో నటించేందుకు ఒప్పించాలి.... అని ఎన్టీఆర్ గతంలో తన మనసులోని కోరికను బయట పెట్టారు. అయితే ఎన్టీఆర్ కోరిక తీరకుండానే శ్రీదేవి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

English summary
"This will be my last and final tweet on Sridevi and from now on I will just imagine she’s still alive and well. Sridevi garu,even after I made u laugh so much why are u now making me cry so much ..I won’t ever talk to u from now on..Katti Forever." RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu