»   » వర్మ మెచ్చుకున్నాడని...ఆమె కోసం గూగుల్ సెర్చ్

వర్మ మెచ్చుకున్నాడని...ఆమె కోసం గూగుల్ సెర్చ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ట్వీట్టర్ ని అడ్డం పెట్టుకుని తన మనస్సులో ని అభిప్రాయాలను,ఆలోచనలను నిర్మహమాటంగా ప్రపంచం తో పంచుకునే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏం చెప్పినా, అది చదువుతూ ఫాలో అవుతూండే వారు అనేకం. తాజాగా ఆయన
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె గురించి ట్వీట్ చేసారు. ఆమె ఎట్రాక్టివ్ గా ఉంటుందని ఆయన అనటంతో అంతా ఆమె ఎలా ఉంటుందో చూడ్డానికి గూగుల్ సెర్చ్ లో పడ్డారని సమాచారం.

వర్మ ట్వీట్ లో... " పూర్తిగా వ్యక్తిగతంగా నాకు నవాజ్ షరీష్ కుమార్తె... సోనియా గాంధీ కుమార్తె కన్నా ఎట్రాక్టివ్ గా కనిపించింది ." అని కామెంట్ చేసారు. ఇక నవాజ్ షరీఫ్ కుమార్తె పేరు మరియం షరీఫ్.

RGV Likes Maryam Nawaz Sharif Very Much

మరియం షరీఫ్ రీసెంట్ గా తన తండ్రితో కలిసి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసారు. షరీఫ్‌ తల్లి కోసం నరేంద్రమోదీ కానుకగా పంపించిన శాలువాను షరీఫ్‌ ఆమెకు అందించారు. దీనిపై షరీఫ్‌ కుమార్తె స్పందించారు. తన నానమ్మ కోసం అందమైన శాలువాను పంపించినందుకు ఆమె మోదీకి ట్వీటర్‌లో ధన్యవాదాలు తెలిపారు. శాలువాను తన తండ్రి స్వయంగా నానమ్మకు ఇచ్చినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. మోదీ పంపించిన శాలువా, ఫొటొను కూడా ఆమె ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు.

మంచు ఫ్యామిలీతో కలిసి రౌడీ చిత్రం తెరకెక్కించిన వర్మ తన తదుపరి చిత్రాన్ని సైతం మంచు విష్ణుతోనే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనే ఆమెకు అవకాసం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె జర్నలిస్టు గా కనిపించనుందని తెలుస్తోంది. ఈ చిత్రం టైటిల్ టెన్షన్...టెన్షన్ అని ప్రచారంలోకి వచ్చింది. అయితే అది కాదు అని వర్మ కొట్టిపారేసారు. అయితే ఇప్పుడు తాజాగా ...ఆ చిత్రానికి '13' అనే టైటిల్ ని ఖరారు చేసారని అంతర్గత వర్గాల సమాచారం. ఈ చిత్రంలో విష్ణు ..పోలీస్ గా కనిపించనున్నారు. చిత్రంలో ఐదుకి పైగానే ఫిమేల్ రోల్స్ ఉంటాయని తెలుస్తోంది.

'13' అని టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటంటే... విష్ణుకి ఇది 13 వ చిత్రం కావటం, 13 అనేది మిస్టీరియస్ సంఖ్య కావటం,తమ కథ కూడా క్రైమ్ తో నడిచే మిస్టరీ తరహా థ్రిల్లర్ చిత్రం కావటం,చిత్రంలోనూ 13 మర్డర్స్ ఉండటంతో అదే టైటిల్ ని ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది. అలాగే అంకెతో టైటిల్ కావటంతో జనాల్లోకి బాగా వెళ్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా ఈ విషయమై ఏ విధమైన సమాచారం లేదు.

వర్మ మాట్లాడుతూ.... విష్ణుతో ఇంకో సినిమా చేస్తున్నాను. కానీ దాని పేరు టెన్షన్‌ కాదు.. అటెన్షన్‌ కాదు. సినిమా పూర్తయ్యాక పేరు చెప్తాను. మరో కథ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాను అని చెప్పారు.

English summary
Ram Gopal Varma tweeted:"Purely on a personal and being human level I find Nawaz Sharif’s daughter much more attractive than Sonia Gandhi's daughter."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu