వర్మపై ఇరవై కోట్ల అప్పు కేసు??

By Srikanya

ముంబై: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై నిర్మాత భరత్ షా కేసు వేసినట్లు సమాచారం. తన వద్ద నుంచి తీసుకున్న పది కోట్ల రూపాయలు..దాని వడ్డి మరో పది కోట్లు కలిపి కట్టాలని నోటీసు పంపినట్లు ముంబై పత్రికల సమాచారం. ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్ ..వర్మ జవాబు కోసం ఎదురుచూస్తున్నట్లు అక్కడి మీడియా వ్యాఖ్యానించింది. అయితే వర్మ ఈ వడ్డిని కట్టడానికి సిద్దంగా లేరని,అదీ కూడా ఆ నిర్మాత స్వయంగా తాను పెట్టుబడి పెట్టి సినిమాలు తీసుకున్నాడు,ఆయన పేరే నిర్మాత,సమర్పడుగా వేసారు కాబట్టి కట్టక్కర్లేదని కొందరు అంటున్నారు. ఈ విషయమై వర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడనేది తెలియరాలేదు.

ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో '26/11' అనే చిత్రం రూపొందబోతోంది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన కార్యక్రమాల్లోనే ఆయన నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్ర కథలో ఉగ్రవాద నిరోధక సంస్థ ఉన్నతాధికారి పాత్ర కీలకం. ఇది రాకేష్‌ మారియా అనే ఐపీఎస్‌ అధికారి జీవితానికి దగ్గరగా ఉంటుందని బాలీవుడ్‌ సమాచారం. ఆ పాత్ర కోసం కమల్‌హాసన్‌నీ దర్శకుడు సంప్రదించారు. అయితే ఆయన రిజెక్టు చేసారని సమాచారం. తర్వాత సంజయ్‌ దత్‌నీ అనుకున్నారు కానీ డిపార్టమెంట్ చిత్రం డిజాస్టర్ కావటంతో సంజూ సైతం వర్మ ప్రాజెక్టుపై ఆసక్తి చూపలేదు. దాంతో ఆ పోలీసు పాత్రను నానాపటేకర్‌ పోషిస్తున్నారు.

నానా గతంలో వర్మ రూపొందించిన 'అబ్‌ తక్‌ చప్పన్‌'లో నటించారు. ముంబై లో 2008 నవంబరు 26న జరిగిన ఉగ్రవాద దాడులను కథగా మలచుకొన్నారు రామ్‌గోపాల్‌ వర్మ '26/11' చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో తెలుస్తాయి. మరో ప్రక్క ఆయన మనీషా కొయరాల,జెడి చక్రవర్తి కాంబినేషన్ లో భూత్ సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తిగా 3D ఫార్మాట్లో రూపొందిస్తున్నారు. వీటితో పాటు వర్మ..సత్య చిత్రం సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X