»   » మామూలుగా లేదు‌: వర్మ 'కిల్లింగ్‌ వీరప్పన్‌' కొత్త ట్రైలర్

మామూలుగా లేదు‌: వర్మ 'కిల్లింగ్‌ వీరప్పన్‌' కొత్త ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: చందనం చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవితచరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కిల్లింగ్‌ వీరప్పన్‌'. ఈ చిత్రం రెండో ట్రైలర్ ని ముందుగా తెలియచేసిన సమయానికే విడుదల చేసారు వర్మ. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

చూసిన ప్రతీ వారు వర్మ ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు అంటున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మీరూ ఈ ట్రైలర్ ని ఈ క్రింద చూసి, మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ భాక్స్ లో పంచుకోండి.

ఈ చిత్రం ట్రైలర్‌-2ను వీరప్పన్‌ మృతి చెందిన రోజు అదే సమయానికి అంటే.. ఈ నెల 18న రాత్రి 10.40 గంటలకు విడుదల చేసినట్లు రామ్‌గోపాల్‌వర్మ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు.

గందపుచెక్కల దొంగ వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అండర్‌ వరల్డ్‌ డాన్‌, మాఫియా డాన్‌ల కంటే కూడా వీరప్పన్‌ ఎంతో శక్తివంతుడు అని, ఆయన తిరుగులేని క్రిమినల్‌ అంటూ వీరప్పన్‌ గురించి వర్మ చెబుతు మరీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6న ఈ చిత్రం విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

కన్నడ హీరో శివరాజ్ కుమార్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. పరుల్ యాదవ్, యజ్ఞ శెట్టి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్ర పోషిస్తున్నాడు. గతంలో రాజ్‌ కుమార్‌ను వీరప్పన్‌ కిడ్నాప్‌ చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో శివరాజ్‌ కుమార్‌ను ఈ సినిమాకు హీరోగా ఎంపిక చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

RGV's Killing Veerappan Telugu Trailer 2

కన్నడం, హిందీ, తెలుగు మరియు తమిళంలో ఈ సినిమాను విడుదల చేస్తాను అంటూ వర్మ ప్రకటించాడు. చాలా సినిమాలు చేస్తున్న వర్మ ఈ సినిమాను ఎప్పటికి పూర్తి చేస్తాడో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక వీరప్పన్‌గా రామ్ గోపాల్ వర్మ ఓ థియేటర్ ఆర్టిస్ట్‌ను ఎంపిక చేయడం విశేషం. ఢిల్లీకి చెందిన... థియేటర్ ఆర్టిస్ట్ సందీప్ భరద్వాజ్ రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్‌'లో వీరప్పన్‌గా నటిస్తున్నారు. వీరప్పన్ లుక్స్, మ్యానరిజం ఇలా అన్నింటినీ తెలుసుకొని ఆ పాత్రలో సందీప్ ఒదిగిపోయి నటిస్తున్నాడని వీరప్పన్ ఎలా ఉండనున్నాడనే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తూ వర్మ తెలిపారు.

ఆ మధ్యన విడుదలైన మొదటి ట్రైలర్ ని ఇక్కడ చూడండి.

వర్మ మాట్లాడుతూ... వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత అతడు ఎంత డేంజరస్ వ్యక్తి అనే విషయం అర్థమైందని, అలాంటి క్రిమినల్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథే ఈ ‘కిల్లింగ్ వీరప్పన్' అని వర్మ తెలిపారు.

వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత మాఫియా గ్యాంగ్‌స్టర్ మర్డర్స్ లాంటివి చిన్న పిల్లల ఆటలా కనిపించాయని వర్మ తెలిపాడు. ఒసామా బిన్ లాడెన్ కన్నా శక్తిమంతుడైన వీరప్పన్ ఎంతో మంది పోలీసులను, అడవి జంతువులను చంపి తిరుగులేని క్రిమినల్‌గా అవతరించాడని వర్మ చెప్పుకొచ్చాడు.

English summary
RGV's Killing Veerappan Telugu Trailer 2 released. Killing Veerappan is an upcoming film directed by Ram Gopal Varma with Shivaraj Kumar, Sandeep Bharadwaj and Parul Yadav in lead roles. Produced by BV Manjunath, music composed by Sai Kartheek, Ravi Shanker. Background Music and Sound Design by Seshu KMR.
Please Wait while comments are loading...