»   » వర్మ ‘వంగవీటి’ ట్రైలర్‌ (వీడియో) సరే, మధ్యలో పవన్ ని ఎందుకు కెలికటం?

వర్మ ‘వంగవీటి’ ట్రైలర్‌ (వీడియో) సరే, మధ్యలో పవన్ ని ఎందుకు కెలికటం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నిజ జీవితకథలను తెరకెక్కించటంలో రామగోపాల్ వర్మ శైలే వారు. అలా'రక్తచరిత్ర', 'కిల్లింగ్‌ వీరప్పన్‌' తదితర చిత్రాలను రూపొందించిన ఆయన తాజాగా విజయవాడకు చెందిన రాజకీయ నాయకుడు వంగవీటి మోహన రంగా జీవితం తెరకెక్కిస్తూ వార్తలకు ఎక్కారు. రంగా జీవితం ఆధారంగా రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'వంగవీటి'. కాపు కాసే శక్తి ట్యాగ్ లైన్.

ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను వర్మ శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్రైలర్‌ను విడుదల చేశారు. శాంతి దూతగా పేరొందిన గాంధీ జయంతి రోజున హింసాత్మకమైన 'వంగవీటి' ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు వర్మ ట్వీట్‌ చేసి మరీ ట్రైలర్ ని విడుదల చేసారు.

'భయపడేవాడెవ్వడూ రౌడీ అవ్వలేడు' అంటూ ట్రైలర్‌ ప్రారంభమవుతోంది. రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

 తన వైపు ఎట్రాక్ట్ చేసుకోవటానికే..

తన వైపు ఎట్రాక్ట్ చేసుకోవటానికే..

రామ్ గోపాల్ వర్మ తొలి నుంచి తన చిత్రాలను ప్రమోట్ చేసుకునే పద్దతి వేరుగా డిజైన్ చేస్తూ వస్తున్నారు. సినిమా ట్రైలర్ గానీ, మరొకటి కానీ రిలీజ్ కు ముందు ట్విట్టర్ లో ఎవరో ఓ పెద్ద వ్యక్తి పైనో లేక స్టార్ పైనో వివాదాస్పద కామెంట్స్ చేయటం, అందరినీ తన దృష్టికి ఆకర్షించి తర్వాత తను ప్రకటించే ట్రైలర్ నో మరొకటో వదలటం చేస్తూ వస్తున్నారు.

పవన్ ని కాపు కాసే శక్తి అంటూ..

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరోసారి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ను ఉద్దేశించి ట్విట్టర్‌ లో కీలక వ్యాఖ్యలు చేసి అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసారు. పవన్‌ తెలుగు ప్రజలందరినీ కాపు కాసే శక్తి అవుతాడని, తనకు ఆ ధీమా ఉందని వర్మ ట్వీట్‌ చేశాడు.

పవన్ ని ఎందుకు తలిచారో ఈ సారి

పవన్‌.. చాలా కమ్మగా కాపు కాసే శక్తి లాంటి అత్యున్నత నాయకుడు వంటి వాడని వర్మ​ కామెంట్‌ చేశాడు.

 పవన్ కులాన్ని ఎందుకు ఉద్దేసించాడు

పవన్ కులాన్ని ఎందుకు ఉద్దేసించాడు

అయితే వర్మ చేసిన ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ కులాన్ని ఉద్దేసించి అని అర్దమవుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉన్న మరో సామాజిక వర్గం కమ్మ కులాన్ని కూడా ఉద్దేశించినట్లు తెలుస్తున్నాయి. వర్మ ఏ ఉద్దేశంతో వీటని అన్నారో కానీ ఈ ట్వీట్స్ ఇప్పుడు చర్చనీయాంసమవుతున్నాయి.

వేరే విధంగా భావిస్తున్నారంటూ..

అయితే ఈ విషయమై వర్మ వెంటనే క్లారిటీ ఇస్తున్నానంటూ మరో ట్వీట్ చేసాడు. కమ్మగా అంటే స్వీట్‌ అని అర్థమని, కొందరు భావిస్తున్నట్టు కాపు, కమ్మ కులాలకు సంబంధించినది కాదని ట్వీట్‌ చేశాడు. అంటే డైరక్ట్ గా అదే కులాలను ఉద్దేసించి అన్నారని అర్దమవుతోంది.

 పవన్ ని అడ్డం పెట్టి

పవన్ ని అడ్డం పెట్టి

విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో వర్మ వంగవీటి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాటలో కాపు, కమ్మ కులాల ప్రస్తావన ఉంది. వర్మ తాజాగా పవన్‌పై చేసిన కామెంట్స్‌ లో కమ్మ, కాపు పేర్లు ప్రస్తావనకు రావడం చర్చనీయాంశంగా మారింది.

హత్యతో ముగుస్తుంది

హత్యతో ముగుస్తుంది

ఈ చిత్రంలో రంగా రాజకీయ ఆరంగ్రేటం మొదలు రంగా హత్యకు దారితీసిన పరిణామాలు, రంగా హత్యతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వర్మ తన సినిమాలో చూపించనున్నారని అంటున్నారు. రంగా సోదరుడు రాధాకృష్ణ హత్యతో ఈ కథ ప్రారంభమై రంగా హత్యతో ముగుస్తుందని వర్మ తెలిపారు.

 ఈ సినిమాతో వర్మ ఆపేస్తారా

ఈ సినిమాతో వర్మ ఆపేస్తారా

ఇపుడు ఆయన తీస్తున్న ‘వంగవీటి' సినిమాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా తర్వాత తెలుగులో సినిమాలు తీయనని ప్రకటించారు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అయినా, నేను నిజంగా పుట్టి పెరిగింది విజయవాడలో... ఎందుకంటే నాకు అవగాహన,తెలివి, బంధాలు, స్నేహాలు, ప్రేమించుకోవడాలు, చంపుకోవడాలు వీటన్నింటి గురించి తెలిసింది విజయవాడలోనే.

 రక్త చరిత్ర వేరు..ఇది వేరు

రక్త చరిత్ర వేరు..ఇది వేరు

నేను అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసిన రక్త చరిత్రకి ఇప్పుడు విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్న "వంగవీటికి" ముఖ్యమైన తేడా పగకి, ఆవేశానికి ఉన్న తేడా అంటూ ఈ చిత్రం గురించి గతంలో చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. నిజంగా ఆ సినిమాలో అదే చూపెడుతున్నారా అనేది చూడాల్సిన అంశం.

 దగ్గరనుంచి చూసా

దగ్గరనుంచి చూసా

అలాంటి రౌడీయిజం రూపాన్ని, దాని ఆంతర్యాన్ని 30 ఏళ్ళ క్రితం నేను విజయవాడ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు,బాగా దగ్గరగా స్వయంగా నా కళ్ళతో చూశాను ... అందుకనే విజయవాడ రౌడీయిజం గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు, విజయవాడలో కూడా లేడని బల్ల గుద్దే కాకుండా కత్తితో కూడా పొడిచి చెప్పగలను అంటూ చెప్పుకొచ్చారు వర్మ.

 నిజమేనా లేక ఎప్పటిలాగే..

నిజమేనా లేక ఎప్పటిలాగే..

"వంగవీటి" చిత్రం తెలుగులో నా ఆఖరి చిత్రం అవుతుంది.. "శివ" తో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం "వంగవీటి"తో ముగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కారణం "వంగవీటి" కన్నా అత్యంత నిజమైన మహా గొప్ప కథ మళ్ళీ నాకు జీవితంలో దొరకదని నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి అని వర్మ తెలిపారు.

 ఎన్టీఆర్, దాసరి ని కూడా.,,

ఎన్టీఆర్, దాసరి ని కూడా.,,

ఈ సినిమాలో.....వంగవీటి రాధా, వంగవీటి మోహన రంగా, వంగవీటి రత్నకూమారి పాత్రలతో పాటు...దేవినేని నెహ్రు, దేవినేని గాంధీ, దేవినేని మురళి, కర్నాటి రామమోహనరావు, సిరిస్ రాజు, రాజీవ్ గాంధీ, దాసరి నారాయణ రావు, ముద్రగడ పద్మనాభం, నందమూరి తారక రామారావు పాత్రలను కూడా చూపించబోతున్నట్లు వర్మ ప్రకటించారు.

 రంగాగారిని చంపటంతో ..

రంగాగారిని చంపటంతో ..

వంగవీటి రాధాగారు,చలసాని వెంకటరత్నంగారిని చంపడంతో ఆరంభమైన విజయవాడ రౌడీయిజం, వంగవీటి రంగాగారిని చంపడంతో ఎలా అంతమయ్యిందో చూపించేదే "వంగవీటి" చిత్రం.

 ఆ వాతావరణం పునసృష్టి చేసాం

ఆ వాతావరణం పునసృష్టి చేసాం

కత్తులు, బరిసెలు, అంబాసిడర్ కార్లు, మెటాడోర్ వాన్లు వుండి,సెల్ ఫోన్లు, తుపాకులు లేని 30 ఏళ్ళ క్రితంనాటి ఆ నాటివిజయవాడ వాతావరణాన్ని పునసృష్టించటానికి ఖర్చుకి ఏ మాత్రం వెనకాడద్దని "వంగవీటి" నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో, విజయవాడ గత చరిత్రని ఇప్పటికి, ఎప్పటికి చరిత్రలో నిలిచిపోయేలా చెయ్యటానికి మా"వంగవీటి" యూనిట్ శరవేగంతో సిద్ధమవుతోంది

 చచ్చైనా చంపాలనుకునే..

చచ్చైనా చంపాలనుకునే..

పగతో బుసలు కొట్టే ఫ్యాక్షనిస్ట్,శత్రువే ప్రపంచంగా బతుకుతాడు.. ఆవేశంతో రెచ్చిపోయే రౌడీ,ప్రపంచమే శత్రువుగా బతుకుతాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం తనని ఒక మనిషిగా చూడని పరిస్థితిలోనే ఏ మనిషైనా ఒక రౌడీ అవుతాడు. ఫ్యాక్షనిస్ట్ తను చచ్చైనా శత్రువుని చంపాలనుకుంటాడు ... రౌడీ బతకడానికి మాత్రమే చంపుతాడు.

 దమ్మున్నోడు సింహాసనం

దమ్మున్నోడు సింహాసనం

ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటినుంచీ ఇప్పటివరకూ సాగుతూ వస్తున్న హింసచరిత్రలో ఫ్యాక్షనిస్ట్ ఒక వారధి అయితే రౌడీ ఒక మలుపు. ఫాక్షనిజం కి బ్యాక్ గ్రౌండ్ వారసత్వం అయితే రౌడీయిజానికి వారసత్వం దమ్ము ఒక దమ్మున్నోడు సింహాసనం మీద కూర్చున్న ఇంకో దమ్మునోడిని పైకి పంపటమే అసలు సిసలైన నిజమైన రౌడీయిజం.

 వీరి లైవ్ క్యారక్టర్లతోనే..

వీరి లైవ్ క్యారక్టర్లతోనే..

వంగవీటి రాధా
వంగవీటి మోహన రంగా
వంగవీటి రత్నకూమారి
దేవినేని నెహ్రు
దేవినేని గాంధీ
దేవినేని మురళి
కర్నాటి రామమోహనరావు
సిరిస్ రాజు
రాజీవ్ గాంధీ
దాసరి నారాయణ రావు
ముద్రగడ పద్మనాభం
నందమూరి తారక రామారావు

 వారే నిజమైన కాపు

వారే నిజమైన కాపు

క‌మ్మ‌వాళ్ల మ‌న‌స్త‌త్వాన్ని అర్థం చేసుకునే తెలివి ఉన్న‌వాళ్లే అర్హ‌త ఉన్న నిజ‌మైన కాపుల‌ని చెప్పారు వంగవీటి మోహన్ రంగా అన్నారు రామ్ గోపాల్ వర్మ. ఇక
ఆయన వంగవీటి టైటిల్ తో ఎనౌన్స్ చేసినప్పటినుంచి వార్నింగ్ లు మొదలయ్యాయి. ఆయన తనకు ఇలాంటివి కొత్తేమీ కాదు అని అన్నారు.

 వంగవీటి రాధా వార్నింగ్

వంగవీటి రాధా వార్నింగ్

విజయవాడకు చెందిన పొలిటికల్ లీడర్ వంగవీటి రాధా...ఇప్పటివరకూ తనను కానీ, తన ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ ఈ సినిమా విషయమై వర్మ సంప్రదించలేదన్నారు. సీరియస్ గా వార్నింగ్ తన తండ్రి పేరుతో తీసే సినిమాలో ఏదైనా తేడా వస్తే మాత్రం పరిణామాలకు తాను భాధ్యత కాదన్నట్లుగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

 ఆయన అభిమానులే ఊరుకోరు

ఆయన అభిమానులే ఊరుకోరు

వంగవీటి రాధా మాట్లాడుతూ... సినిమాలో ఉన్నదున్నట్లు వాస్తవాన్ని చూపితే తమకు ఏ అభ్యంతరం లేదని అన్నారు. అంతే తప్ప రంగా జీవితంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఆయన కుమారుడుగా తానెలా స్పందిస్తానో, తనకంటే రంగా అభిమానులే ఎక్కువ స్పందిస్తారని అన్నారు.

ఒక వర్గం వైపుకు మొగ్గితే..

ఒక వర్గం వైపుకు మొగ్గితే..

ఇక వర్మ పక్షపాత ధోరణితో వ్యవహరించి సినిమాలు ఎలా తీస్తారో తనకు తెలుసు అని అన్నారు. ఏదో ఒక వర్గం వైపుకు మ్రొగ్గు చూపే సినిమా పూర్తి చేస్తారని అనుమానం వ్యక్తం చేసారు. ఫ్యాన్స్ బుద్ది చెప్తారు అలాగే తన ఇంటిపేరుతో సినిమాలు తీసి, అందులో ఇష్టం వచ్చినట్లు చూపితే మాత్రం రంగా అభిమానులే బుద్ది చెప్తారని అన్నారు. ఆ సమయంలో తనకు ఎలాంటి భాధ్యతా లేదని, అవన్నీ దృష్టిలో పెట్టుకునే వర్మ సినిమా తీయాలని తేల్చి చెప్పారు.

 ప్లస్ అవుతుంది బిజినెస్ కు

ప్లస్ అవుతుంది బిజినెస్ కు

కిల్లింగ్ వీరప్ప‌న్ త‌ర్వాత వ‌ర్మ జోరు పెంచాడనే చెప్పాలి. మ‌రో వాస్త‌విక క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నాడు. వివాదాస్ప‌ద అంశంలో చేయి పెడుతున్నాడు. బెజ‌వాడలో అంద‌రికీ తెలిసిన నాయ‌కుడు వంగ‌వీటి రంగా జీవిత క‌థ‌ను సినిమాగా మలవటం బిజినెస్ పరంగానూ ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

 పవన్ పాటతో పోల్చమన్నాడు

పవన్ పాటతో పోల్చమన్నాడు

ఈ చిత్రానికి సంబంధించి వర్మ ఓ పాట పాడి అందరిని ఆశ్చర్య పరిచాడు. అంతే కాదు తన పాడిన పాటని పవన్ ఇటీవల జరిగిన సభలో పాడిన పాటకు కంపార్ చేస్తూ ఎవరు బాగా పాడారు అంటూ అందరూ హీరోల అభిమానులకు వోటింగ్ పెట్టాడు. ఏదేమైన వర్మ తన సినిమాకు చేస్తున్న ప్రమోషన్ స్ట్రాటజీని చూసి కొందరు అవాక్కవుతున్నారు.

పవన్ పాటను ఇలా పోస్ట్ చేసి

ఈ సినిమాకు పనిచేస్తున్నది వీరే

ఈ సినిమాకు పనిచేస్తున్నది వీరే

క్రైం డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. వంగవీటిలో సందీప్, వంశీ చాగంటి, కౌటిల్య, శ్రీతేజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా..రవి శంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

English summary
Vangaveeti movie is on the evolution of rowdyism in the 1980’s in Vijayawada directed by Sensational director Ram Gopal Varma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu